సంగారెడ్డి జిల్లాకు జాతీయస్థాయిలో గుర్తింపు.. జపాన్‌కు ఇద్దరు విద్యార్థుల ఎంపిక!

ఇన్స్పైర్ మనక్ జాతీయస్థాయి పోటీల్లో సత్తా చాటిన సంగారెడ్డి జిల్లా విద్యార్థులు

సంగారెడ్డి జిల్లాకు జాతీయస్థాయిలో గుర్తింపు.. జపాన్‌కు ఇద్దరు విద్యార్థుల ఎంపిక!

విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, డీఈఓ ఆర్. రోహిణి


ఇన్స్పైర్ మనక్ జాతీయస్థాయి ప్రదర్శనల్లో సంగారెడ్డి జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. జిల్లాకు చెందిన నలుగురు విద్యార్థులు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనగా, వారిలో ఇద్దరు విద్యార్థులు టాప్‌-60లో స్థానం సంపాదించి అంతర్జాతీయస్థాయికి ఎంపికయ్యారు. జపాన్‌లో నిర్వహించే అంతర్జాతీయ హైస్కూల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌లో పాల్గొనే అవకాశం కూడా వారికి లభించింది. 2023–24, 2024–25 సంవత్సరాలకు సంబంధించిన 12వ ఇన్స్పైర్ మనక్ జాతీయస్థాయి పోటీలు అక్టోబర్ 12 నుంచి 14 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి వివిధ జిల్లాలకు చెందిన 52 ప్రాజెక్టులు ప్రదర్శనకు రాగా, రాష్ట్రం నుంచి ఐదుగురు విద్యార్థులు టాప్‌-60లో స్థానం సంపాదించారు. వీరిలో సంగారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు అంతర్జాతీయస్థాయికి ఎంపిక కావడం విశేషం.

జాతీయస్థాయిలో ప్రతిభ చాటిన విద్యార్థులు:

చౌడపురం సాయి మేఘన – ఆరిజిన్ టెక్నో స్కూల్, పటాన్‌చెరు. మిరియాల స్ప్రే, కంటి చూపును తాత్కాలికంగా అడ్డుకునే ఎల్‌ఈడీ లైట్లతో కూడిన అల్లర్ల నిరోధక కవచం రూపకల్పనకు సంబంధించిన ప్రాజెక్టును ప్రదర్శించి అంతర్జాతీయస్థాయికి ఎంపికయ్యారు.
పూర్ణిత్ రెడ్డి – భారతీయ విద్యాభవన్, బీహెచ్‌ఈఎల్. కృత్రిమ మేధస్సు సహాయంతో దృష్టిలోపం ఉన్నవారికి ఉపయోగపడే సాంకేతిక పరిష్కారాన్ని రూపొందించి అంతర్జాతీయస్థాయికి ఎంపికయ్యారు.
 రుద్ర శరణ్య – పయనీర్ స్కూల్, సంగారెడ్డి. గృహ అవసరాల కోసం బహుళ ప్రయోజనాల వస్తు రవాణా సాధనాన్ని రూపొందించారు.
ఆయుష్ కుమార్ ఉపాధ్యాయ – సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్, వడక్‌పల్లి, అమీన్‌పూర్. సమాచార మార్పిడిలోని అడ్డంకులను అధిగమించేందుకు, దృష్టిలోపం ఉన్నవారికి సహాయపడే పరికరాన్ని రూపొందించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తలుగా ఎదిగి సంగారెడ్డి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. సమాజంలో ఎదురవుతున్న సమస్యలకు శాస్త్రీయ దృక్పథంతో నూతన ఆవిష్కరణలు చేసి, దేశాభివృద్ధికి ఉపయోగపడే ఆవిష్కర్తలుగా ఎదగాలని సూచించారు.
ప్రతిభ చాటిన విద్యార్థులతో పాటు వారి పాఠశాలల యాజమాన్యాలు, గైడ్ టీచర్లు, తల్లిదండ్రులను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్. రోహిణి అభినందించారు. ప్రశంసాపత్రాలు, శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఏడీ శంకర్, ఏఎంఓ బాలయ్య, జిల్లా సైన్స్ అధికారి పి. సిద్ధారెడ్డి, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ వెంకటస్వామి, ఆరిజిన్ పాఠశాల కరస్పాండెంట్ ప్రమోద్, అలేఖ్య, వేణుగోపాలరెడ్డి, పద్మావతి, అశ్విన్ కుమార్, వెంకటేష్, రఘునందనరెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పాలెం శాఖలో ఏబీవీపీ నూతన కమిటీ ఎన్నిక పాలెం శాఖలో ఏబీవీపీ నూతన కమిటీ ఎన్నిక
పాలెం(నాగర్ కర్నూల్) : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) పాలెం శాఖ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. జిల్లా కన్వీనర్ శాంతన్ ఆధ్వర్యంలో శ్రీ...
అర్షణపల్లి శివారులో భూముల రీ-సర్వే రైతులు సహకరించాలి.. భూ వివరాల నమోదును సక్రమంగా పరిశీలించాలి.
దండుపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
పెద్దగొట్టిముక్కలలో విద్యార్థులకు షూస్ పంపిణీ
అంబర్‌పేట మహంకాళి ఆలయంలో వనదుర్గ మహా రుద్ర యాగం, వరుణ యాగం.
జీడికల్‌లో పట్టభద్రుల ఓటరు నమోదుపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి
విద్యార్థులకు అల్పాహారం