యాసంగి లో వరి కి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలి.... మండల వ్యవసాయ అధికారి భాస్కర్
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో మండల వ్యవసాయ అధికారి భాస్కర్ విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు.ప్రస్తుత సూపర్ ఎలినో ప్రభావం వలన,భూగర్భ జల మట్టం తగ్గి పోతుందన్నారు. సూపర్ ఎలినో వల్ల వర్షాలు లేక బోర్లు,బావులలో నీరు లేక,జల విద్యుత్ ఉత్పత్తి లేక,ప్రాజెక్ట్ ల ద్వారా పంటలకు నీటి సరఫరా చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి రైతు సోదరులు ఈ యాసంగి సీజన్ లో అధిక నీటి వినియోగం చేసుకునే వరి పంటకి బదులు గా తక్కువ నీటి తో పండే స్వల్ప కాలిక ఆరు తడి పంటలు తాగు చేయాలని సూచించారు. స్వల్పకాలిక ఆరుతడి పంటలైన నువ్వులు, పెసలు,కందులు,మినుములు,మొక్కజొన్న, వేరు శనగ,శనగ,వివిధ రకాల కూరగాయల పంటలు సాగు చేయాలని మండల రైతులకు విజ్ఞప్తి చేశారు.సూపర్ ఎలినో వలన అత్యంత తీవ్రమైన కరువు పరిస్థితులు ఉంటాయని, రైతులు పొదుపు నీటి వినియోగం తో పండే పంటల వైపు దృష్టి పెట్టాలని కోరారు. రైతు సోదరులు ఆరు తడి పంటలు కాకుండా వరి పంట వేసి ఆర్థికంగా నష్టపోవద్దు అని కోరారు. ఈ యాసంగి లో ఆరు తడి పంటలు వేయడం వలన,పంట మార్పిడి చేయడం తో పప్పు దినుసు పంటల వలన ఆదాయం తో పాటు భూసారం పెరిగి, నేల ఆరోగ్యంగా ఉంటుందన్నారు. తర్వాత వచ్చే ఖరీఫ్ పంటలకు సారవంతమైన నేలలు అందుబాటులో ఉంటాయన్నారు. రైతు సోదరులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలని కోరారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


