న్యూ నలంద పాఠశాలలో ఈ-వేస్ట్ సేకరణ డ్రైవ్

న్యూ నలంద పాఠశాలలో ఈ-వేస్ట్ సేకరణ డ్రైవ్

ఉట్నూర్ : పర్యావరణ పరిరక్షణ, ఎలక్ట్రానిక్ వ్యర్థాల సక్రమ నిర్వహణపై విద్యార్థులకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఉట్నూర్ మండలంలోని లింగోజి తండా ఎక్స్‌రోడ్‌లో ఉన్న న్యూ నలంద ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో బుధువారం ఈ-వేస్ట్ సేకరణ డ్రైవ్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఉపయోగించని మొబైల్ ఫోన్లు, ఛార్జర్లు, పాడైన ఎలక్ట్రానిక్ పరికరాలు, బ్యాటరీలు తదితర ఈ-వ్యర్థాలను సేకరించడం ద్వారా వాటిని బాధ్యతాయుతంగా పారవేయాల్సిన అవసరాన్ని వివరించారు. ఈ-వ్యర్థాలను సాధారణ చెత్తలో కలపకుండా, వాటిని ప్రత్యేకంగా సేకరించి అధీకృత రీసైక్లింగ్ కేంద్రాలకు అందించాలని సూచించారు. 

కరెస్పాండంట్ జాదవ్ వసంత్ రావు మాట్లాడుతూ..

ఈ-వ్యర్థాల వల్ల పర్యావరణానికి కలిగే నష్టాలు, వాటి నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఇలాంటి కార్యక్రమాలను తమ ఇళ్లలోనూ ప్రోత్సహించాలని సూచించారు.

ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో పర్యావరణ స్పృహ పెంపొందించడంతో పాటు, బాధ్యతాయుతమైన వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మత్తడి వాగు కెనాల్‌కు నీటి ని విడుదల చేసిన  ఎమ్మెల్యే అనిల్ జాదవ్,  ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి   మత్తడి వాగు కెనాల్‌కు నీటి ని విడుదల చేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి
ఆదిలాబాద్ బ్యూరో  : రైతుల సాగునీటికోసం ఎదురుచూపులకు తెరదించుతూ తాంసి మండలంలోని మత్తడి వాగు కెనాల్‌కు నీటిని విడుదల చేయడం స్థానిక రైతన్నలకు ఎంతో ఊరటనిచ్చే పరిణామమని...
1న ఆదిలాబాద్ పట్టణంలో జరిగే రైతు గర్జన సభను విజయవంతం చేయాలి - బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ ఎమ్మెల్యే జోగు,బాల్కసుమన్
మంత్రులను కలిసిన గంభీరావుపేట ఏఎంసీ చైర్మన్ మరియు పాలక వర్గం
మల్లారం సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు
పీఎం శ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌ శివంపేటలో ఈ-వేస్ట్‌పై అవగాహన కార్యక్రమం
శివన్నగూడెం పనులను వెంటనే పూర్తి చేయాలి
న్యూ నలంద పాఠశాలలో ఈ-వేస్ట్ సేకరణ డ్రైవ్