తాడూరు జడ్పీ పాఠశాలలో బాలల భద్రతపై అవగాహన సదస్సు
బాలల హక్కులు, పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన: న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నిహారిక
తాడూరు(నాగర్ కర్నూల్)
నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బాలల భద్రతపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ‘సురక్షిత్ బచ్పన్ అభియాన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి నిహారిక హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 6 నుంచి 14 ఏళ్ల బాలబాలికలు తప్పనిసరిగా పాఠశాలకు వెళ్లి చదువుకోవాలని సూచించారు. బాలల హక్కులు, రక్షణ, భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు వివరించారు. బాలికలపై లైంగిక దాడులు, వేధింపుల నివారణకు పోక్సో చట్టంపై వివరణ ఇచ్చారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పిల్లల భద్రత, హక్కుల పరిరక్షణే సురక్షిత్ బచ్పన్ అభియాన్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ న్యాయవాది శ్రీరామ్ ఆర్య, జిల్లా బాలల సంరక్షణ అధికారి శ్రీశైలం గౌడ్, ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


