తెలంగాణ రాష్ట్రంలో క్రీడా రంగ అభివృద్ధిపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో క్రీడా రంగ అభివృద్ధిపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి- ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో క్రీడా రంగ అభివృద్ధిపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ముఖ్యమంత్రిఎ. రేవంత్ రెడ్డి గారు అన్నారు. క్రీడల్లో రాణించిన వారికి క్యాష్ రివార్డులతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు.

ఇటీవల విజయవంతంగా జరిగిన సీజన్-1 టీజీ-20 క్రికెట్ లీగ్‌లో విజేతగా నిలిచిన హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ జట్టు ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా జట్టు సభ్యులను అభినందించిన ముఖ్యమంత్రి గారు వారికి చెక్కులను అందజేశారు.

క్రీడలకు సంబంధించి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ తెలంగాణకు ప్రత్యేక స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చామని, స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. గచ్చిబౌలి స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. గతంలో జాతీయ స్థాయి క్రీడలకు హైదరాబాద్ వేదికగా నిలిచిందని గుర్తుచేశారు.
గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులకు తమ ప్రతిభను చాటుకునేందుకు టీజీ20 ఒక మంచి అవకాశంగా నిలుస్తోందని అభిప్రాయపడ్డారు. టీజీ20లో విజయం సాధించిన హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ జట్టు సభ్యులందరినీ అభినందిస్తూ, భవిష్యత్తులో దేశ ప్రతిష్ఠను పెంచే క్రీడాకారులుగా ఎదగాలని ఆకాంక్షించారు.
ఏ రంగంలోనైనా రాణించాలంటే ఫోకస్ అవసరమని, ఎంచుకున్న రంగంపై గౌరవం, ఆసక్తి ఉండాలని క్రీడాకారులకు ముఖ్యమంత్రి గారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఈనాడు సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్ కిరణ్ గారు, ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ గారు పాల్గొన్నారు.
Views: 1

About The Author

VIJAY SRIRAMULA Picture

 విజయ్ శ్రీరాముల.  ప్రొఫెషనల్ వెబ్ న్యూస్ కంటెంట్ రైటర్‌. డిజిటల్ మీడియా ద్వారా సమాచారాన్ని సమర్థవంతంగా చేరవేయడంలో . కరెంట్ అఫైర్స్, స్థానిక మరియు అంతర్జాతీయ వార్తలు, సాంకేతికత, మరియు వ్యాపార రంగాలకు సంబంధించిన తాజా విషయాలను లోతుగా పరిశోధించి, పాఠకులకు సులభంగా అర్థమయ్యే రీతిలో డిజిటల్ కంటెంట్‌ను రూపొందిస్తాను

Tags:
Error on ReusableComponentWidget

Latest News

గ్లోబల్ ఫుడ్ ప్రాసెసింగ్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్- రాష్ట్ర మంత్రి టి.జి. భరత్ గ్లోబల్ ఫుడ్ ప్రాసెసింగ్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్- రాష్ట్ర మంత్రి టి.జి. భరత్
*"గ్లోబల్ ఫుడ్ ప్రాసెసింగ్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్:* *17వ ‘ఫుడ్ వరల్డ్ ఇండియా 2026’ సదస్సులో రాష్ట్ర మంత్రి టి.జి. భరత్ *దేశ ఆహార శుద్ధి రంగంలో 9%...
వికలాంగ విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యం- సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
తెలంగాణ రాష్ట్రంలో క్రీడా రంగ అభివృద్ధిపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
తెలంగాణ సహకార రంగం పనితీరుపై ఇరాన్ ప్రతినిధి బృందానికి వివరించిన -మంత్రి తుమ్మల
కొత్త భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు 'బిమ్‌స్టెక్' దేశాలు గట్టిగా కలిసి పనిచేయాలి: ఎన్‌ఎస్‌ఏ అజిత్ డోభాల్ పిలుపు
పేదింటి స్వంత ఇంటి కళ ఇందిరమ్మ రాజ్యంతోనే సాకారం అయింది-స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఎల్ నినో.. ఎఫెక్ట్ !! ​కరవొస్తోంది.. జాగ్రత్త!