అనాథ వృద్ధులకు బాలవికాస అండ.

40 మంది వృద్ధులకు నిత్యావసర సరుకులు, దుస్తుల పంపిణీ,ఉచిత వైద్య పరీక్షలు

అనాథ వృద్ధులకు బాలవికాస అండ.

ఆప్యాయతకు దూరమై, ఆదరించే వారు లేక ఒంటరి జీవితాన్ని గడుపుతున్న అనాథ వృద్ధులకు అండగా నిలవడమే లక్ష్యంగా బాలవికాస ఆధ్వర్యంలో బాలక్క సహకారంతో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో అనాథ వృద్ధుల ఆదరణ దినోత్సవాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా సుమారు 40 మంది అనాథ వృద్ధులకు నిత్యావసర సరుకులు, దుస్తులు,బియ్యం,పెద్ద డబ్బాలు, పండ్లు పంపిణీ చేశారు. అంతేకాకుండా వృద్ధుల కోసం ప్రత్యేకంగా భోజన ఏర్పాట్లు చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాలవికాస వాటర్ ప్లాంట్ల ఫెడరేషన్ అధ్యక్షులు కేడం లింగమూర్తి, మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్‌పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు వాల సుప్రజ, పిల్లి తిరుపతి హాజరయ్యారు. అలాగే దాతలు,రిటైర్డ్ ఉపాధ్యాయురాలు సంధ్యావలి, సత్యం పాల్గొని వృద్ధులకు అవసరమైన సహాయ సామగ్రి పంపిణీలో భాగస్వాములయ్యారు.
వృద్ధులకు ఉచిత వైద్య పరీక్షలు.. మందుల పంపిణీ
వృద్ధాప్యంలో అనేక ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొనే వృద్ధులు, దివ్యాంగుల ఆరోగ్య పరిరక్షణకు కూడా నిర్వాహకులు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చారు. సమతా నర్సింగ్ హోమ్ వైద్య సిబ్బంది వృద్ధులకు, దివ్యాంగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఆర్థిక ఇబ్బందులతో వైద్య సేవలు పొందలేని వారికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా నిలిచింది.
మానవత్వమే నిజమైన సేవ
కుటుంబ ఆదరణకు దూరంగా జీవిస్తున్న వృద్ధులకు అవసరమైన వస్తువులు అందించడంతోపాటు, వారితో ఆప్యాయంగా గడపడం, వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపడం ఈ కార్యక్రమానికి ప్రత్యేకతగా నిలిచింది. వృద్ధుల పట్ల సమాజానికి బాధ్యత ఉందని చాటిచెప్పేలా నిర్వహించిన ఈ కార్యక్రమం పలువురి ప్రశంసలు అందుకుంది.
ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం, నిరాదరణకు గురైన వృద్ధులకు భరోసా కల్పించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అనే సందేశాన్ని ఈ కార్యక్రమం చాటిచెప్పింది.ఆదరణకు నోచుకోని వృద్ధులకు ఆపన్నహస్తం బాలవికాస ఆధ్వర్యంలో నిర్వహించారు.

Views: 42

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

హలో నేతకాని.. ఛలో ఉస్మానియా’కు దుర్గం చిన్నయ్య మద్దతు. హలో నేతకాని.. ఛలో ఉస్మానియా’కు దుర్గం చిన్నయ్య మద్దతు.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న ‘హలో నేతకాని.. ఛలో ఉస్మానియా’ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మద్దతు ప్రకటించారు. వర్గీకరణ అంశంలో నేతకాని సమాజానికి జరిగిన అన్యాయంపై...
నేడు బాన్సువాడ కు మంత్రి సీతక్క రాక.
మహేష్ కుమార్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కాట శ్రీనివాస్ గౌడ్.
చౌటకూర్‌లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు.
మాజీ సర్పంచి మృతికి.
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో BC కులసంఘాల రౌండ్ టేబుల్ సమావేశం.
తెలంగాణ ఉద్యమకారుల అరెస్టులను ఖండించిన ఉద్యమకారులు బెల్లంపల్లి.