తెలంగాణ సహకార రంగం పనితీరుపై ఇరాన్ ప్రతినిధి బృందానికి వివరించిన -మంత్రి తుమ్మల

తెలంగాణ సహకార రంగం పనితీరుపై ఇరాన్ ప్రతినిధి బృందానికి వివరించిన -మంత్రి తుమ్మల

రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత & జౌళి శాఖల మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర గనులు మరియు భూగర్భ శాఖ మంత్రి శ్రీ వివేక్ వెంకటస్వామితో కలిసి ఈ రోజు సచివాలయంలో ఇరాన్ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో H.E. Dr. Meidari, ఇరాన్ సహకార, కార్మిక మరియు సామాజిక సంక్షేమ శాఖ మంత్రి, Dr. Sarfi, సహకార శాఖ ఉపమంత్రి, H.E. Dr. Mohammad Fath Ali, భారతదేశంలోని ఇరాన్ రాయబారి, H.E. Hamid Ahmadiyeh, హైదరాబాద్‌లోని ఇరాన్ కాన్సుల్ జనరల్, Mr. Mohsin Moghaddami, వైస్ కాన్సుల్, Mr. Hashemi, ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణలో సహకార ఉద్యమం బలోపేతానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) పనితీరు, సభ్యత్వ విస్తరణ, రైతులకు అందిస్తున్న సేవలు, సహకార రంగంలో రాష్ట్రం సాధించిన పురోగతిని మంత్రి తుమ్మల ప్రతినిధి బృందానికి వివరించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహకార రంగం కీలక పాత్ర పోషిస్తోందని, రైతు సంక్షేమ కార్యక్రమాల అమలులో సహకార సంఘాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని తెలిపారు.
తెలంగాణలో అమలవుతున్న సహకార విధానాలు, సంస్థాగత సంస్కరణలు, సభ్యులకు అందిస్తున్న సేవలపై ఇరాన్ ప్రతినిధి బృందం ఆసక్తి వ్యక్తం చేసింది. భవిష్యత్తులో సహకార రంగంలో పరస్పర అనుభవాల మార్పిడి, సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే అవకాశాలపై ఇరు పక్షాలు చర్చించాయి.
సమావేశం అనంతరం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి ఇరాన్ ప్రతినిధి బృంద సభ్యులను శాలువాలు కప్పి ఘనంగా సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. ప్రతినిధి బృందం కూడా మంత్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ స్నేహపూర్వక సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించింది.
Views: 1

About The Author

VIJAY SRIRAMULA Picture

 విజయ్ శ్రీరాముల.  ప్రొఫెషనల్ వెబ్ న్యూస్ కంటెంట్ రైటర్‌. డిజిటల్ మీడియా ద్వారా సమాచారాన్ని సమర్థవంతంగా చేరవేయడంలో . కరెంట్ అఫైర్స్, స్థానిక మరియు అంతర్జాతీయ వార్తలు, సాంకేతికత, మరియు వ్యాపార రంగాలకు సంబంధించిన తాజా విషయాలను లోతుగా పరిశోధించి, పాఠకులకు సులభంగా అర్థమయ్యే రీతిలో డిజిటల్ కంటెంట్‌ను రూపొందిస్తాను

Tags:
Error on ReusableComponentWidget

Latest News

గ్లోబల్ ఫుడ్ ప్రాసెసింగ్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్- రాష్ట్ర మంత్రి టి.జి. భరత్ గ్లోబల్ ఫుడ్ ప్రాసెసింగ్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్- రాష్ట్ర మంత్రి టి.జి. భరత్
*"గ్లోబల్ ఫుడ్ ప్రాసెసింగ్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్:* *17వ ‘ఫుడ్ వరల్డ్ ఇండియా 2026’ సదస్సులో రాష్ట్ర మంత్రి టి.జి. భరత్ *దేశ ఆహార శుద్ధి రంగంలో 9%...
వికలాంగ విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యం- సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
తెలంగాణ రాష్ట్రంలో క్రీడా రంగ అభివృద్ధిపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
తెలంగాణ సహకార రంగం పనితీరుపై ఇరాన్ ప్రతినిధి బృందానికి వివరించిన -మంత్రి తుమ్మల
కొత్త భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు 'బిమ్‌స్టెక్' దేశాలు గట్టిగా కలిసి పనిచేయాలి: ఎన్‌ఎస్‌ఏ అజిత్ డోభాల్ పిలుపు
పేదింటి స్వంత ఇంటి కళ ఇందిరమ్మ రాజ్యంతోనే సాకారం అయింది-స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఎల్ నినో.. ఎఫెక్ట్ !! ​కరవొస్తోంది.. జాగ్రత్త!