విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి

ఇందల్వాయి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌లో క్లస్టర్ లెవెల్ కల్చరల్ ఫెస్ట్ ప్రారంభం  పాఠశాల అభివృద్ధికి రూ.6 కోట్లు, ప్రాంత అభివృద్ధికి రూ.11 కోట్లు కేటాయింపు  విద్యార్థుల కోసం నాలుగు ఎకరాల్లో క్రీడా మైదానం ఏర్పాటుకు కృషి చేస్తా

విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి

నిజామాబాద్ : విద్యార్థులు చదువుతో పాటు సాంస్కృతిక, క్రీడా తదితర అన్ని రంగాల్లో రాణించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి ఆకాంక్షించారు. విద్యార్థులు పాఠ్యపుస్తకాల్లోని అంశాలకే పరిమితం కాకుండా సమాజంతో మమేకమై తమలోని ప్రతిభను వెలికితీసుకోవాలని సూచించారు.గురువారం ఇందల్వాయి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌లో నిర్వహించిన క్లస్టర్ లెవెల్ కల్చరల్ ఫెస్ట్‌కు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాఠశాలకు చేరుకున్న ఎమ్మెల్యేకు విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి విద్యతో పాటు సహపాఠ్య కార్యక్రమాలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. సాంస్కృతిక, సాహిత్య, క్రీడా రంగాల్లో నిర్వహించే కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, సృజనాత్మకతను పెంపొందిస్తాయని తెలిపారు. ప్రతి విద్యార్థి తనలోని ప్రత్యేక ప్రతిభను గుర్తించి, అన్ని రంగాల్లో రాణించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఇందల్వాయి ఏకలవ్య పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు.
 పాఠశాలలో తరగతి గదుల నిర్మాణం, ఇతర మౌలిక వసతులు, అభివృద్ధి పనుల కోసం రూ.6 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. అదేవిధంగా పాఠశాల నుంచి మాక్లూర్ తండా వరకు రహదారి నిర్మాణంతో పాటు ఈ ప్రాంతంలోని వివిధ అభివృద్ధి పనుల కోసం మరో రూ.11 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. వీటిలో కొన్ని పనులు ఇప్పటికే పూర్తయ్యాయని, మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయని వివరించారు.

పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయ సిబ్బంది విజ్ఞప్తి మేరకు విద్యార్థులకు మెరుగైన క్రీడా సదుపాయాలు కల్పించేందుకు నాలుగు ఎకరాల స్థలంలో క్రీడా మైదానం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను పరిశీలించి, ఆ దిశగా అవసరమైన చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల సంక్షేమానికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు.విద్యార్థులు విద్యలోనే కాకుండా కళలు, సంస్కృతి, క్రీడలు, సామాజిక సేవ వంటి వివిధ రంగాల్లో తమ ప్రతిభను చాటుకుంటూ పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

తాటికొండ క్రాస్ రోడ్డు వద్ద కారులో అగ్నిప్రమాదం తాటికొండ క్రాస్ రోడ్డు వద్ద కారులో అగ్నిప్రమాదం
స్టేషన్ ఘన్‌పూర్,  : స్టేషన్ ఘన్‌పూర్ మండలంలోని తాటికొండ క్రాస్‌రోడ్డు వద్ద గురువారం చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో నిస్సాన్‌ టెర్రానో కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు...
విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
ఈనెల 15 న ఏ ఎస్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల కు ఉచిత టెస్ట్.
మల్హర్‌రావు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎం ఎస్ ఎఫ్ నూతన కమిటీ ఎన్నిక
15 నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి రాసూరి యుగేందర్
పశువుల ఆరోగ్య పరిరక్షణకు ఉచిత వెటర్నరీ వైద్య శిబిరం
ఘనంగా మండల అంతర్ పాఠశాల క్రీడోత్సవాలు