విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించాలి -- జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించాలి -- జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

స్టేషన్ ఘన్‌పూర్ : విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. శుక్రవారం స్టేషన్ ఘన్‌పూర్ మండలం మీదికొండ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించి పాఠశాలలోని మౌలిక సదుపాయాలు, మధ్యాహ్న భోజనం నాణ్యత, బోధన తీరు, వంటగది, తరగతి గదులు, గ్రంథాలయం, కంప్యూటర్లు, పాఠశాల పరిసరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో నేరుగా మాట్లాడి మధ్యాహ్న భోజనం, గుడ్లు, పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తుల పంపిణీ, ఉపాధ్యాయుల బోధన, క్రీడా శిక్షణ తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తరగతి గదుల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరీక్షించేందుకు సైన్స్ పాఠ్యాంశాలపై ప్రశ్నలు అడిగి, స్వయంగా బ్లాక్‌బోర్డుపై పాఠాలు బోధించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సబ్జెక్టును విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. బోధించిన పాఠ్యాంశాలను విద్యార్థులతో తిరిగి చదివించడం, రాయించడం ద్వారా నిరంతర అభ్యాసం చేయించాలని తెలిపారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాల తరగతి గదులు, పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, చెత్తాచెదారం, పిచ్చిమొక్కలను తొలగించి ఆహ్లాదకరమైన విద్యా వాతావరణాన్ని కల్పించాలని అన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు క్రీడల్లోనూ తగిన శిక్షణ అందించి వారి నైపుణ్యాలను పెంపొందించాలని తెలిపారు. వంటశాలలో తప్పనిసరిగా గ్యాస్ పొయ్యి మీదనే వంటలు చేయాలని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, సృజనాత్మకత, క్రీడా నైపుణ్యాలను పెంపొందించి వారి ఉజ్వల భవిష్యత్తుకు ఉపాధ్యాయులు బాటలు వేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి, పంచాయతీ కార్యదర్శి రాజు తదితరులు పాల్గొన్నారు.

Views: 20

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

 ఫత్లాపూర్‌లో పౌర హక్కుల దినోత్సవం ఫత్లాపూర్‌లో పౌర హక్కుల దినోత్సవం
బిచ్కుంద  :  ఫత్లాపూర్ గ్రామంలో గురువారం పౌర హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిచ్కుంద మండల తహసీల్దార్  వేణుగోపాల్ ముఖ్య...
స్క్రాప్ దుకాణం ప్రారంభించిన పాలకుర్తి సారంగపాణి
చెరువులో పడిన వ్యక్తి మృతి
అల్లాదుర్గంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
ఇంటర్ జోనల్ టీ20లో మెదక్ పోలీసుల సత్తా
మనోహరాబాద్ రైతు వేదికలో పీఎం కిసాన్ నిధుల విడుదల కార్యక్రమం
విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి -- పోలీసుల విధులు, చట్టాలపై అవగాహన -- సీఐ శ్రీనివాస్