బస్వాపూర్‌లో ఉచిత పశువైద్య శిబిరం.. పాడి రైతులకు వైద్య సేవలు

* పశువులకు గర్భకోశ చికిత్సలు, చూడు పరీక్షలు, కృత్రిమ గర్భధారణ * దూడలకు నట్టల నివారణ మందుల పంపిణీ * పశుగ్రాసం కొరత నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని డాక్టర్ సంధ్యారాణి సూచన

బస్వాపూర్‌లో ఉచిత పశువైద్య శిబిరం.. పాడి రైతులకు వైద్య సేవలు

చౌటకూర్ :  సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని బస్వాపూర్ గ్రామంలో శుక్రవారం ఉచిత పశువైద్య శిబిరాన్ని నిర్వహించారు. పశుగణాభివృద్ధి సంస్థ, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో గ్రామంలోని పాడి రైతులకు పశువైద్య సేవలు అందించారు.ఈ సందర్భంగా పశువైద్యురాలు డాక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో పశుగ్రాసం కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు ఇప్పటి నుంచే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా బోరు బావుల వద్ద అందుబాటులో ఉన్న స్థలాల్లో పశుగ్రాసాన్ని సాగు చేసుకోవాలని తెలిపారు. జాబ్ కార్డు కలిగిన రైతులు ఉపాధి హామీ పథకం (వీబీజీ రామ్‌జీ) ద్వారా పశుగ్రాసం సాగుకు అవసరమైన పనుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.శిబిరంలో భాగంగా పశువులకు గర్భకోశ సంబంధిత చికిత్సలు, చూడు పరీక్షలు నిర్వహించారు. ఎదకు వచ్చిన పశువులకు కృత్రిమ గర్భధారణ సేవలు అందించారు. అదేవిధంగా దూడలకు నట్టల నివారణ మందులు తాగించారు. పశువుల ఆరోగ్య పరిరక్షణ, పాల ఉత్పత్తి పెంపు, పాడి రైతులకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ బర్మల రాజు, గోపాలమిత్ర సూపర్‌వైజర్ చెన్నగళ్ల అర్జున్, సిబ్బంది డి. మాణిక్యం, ఈ. ప్రవీణ్ కుమార్ (వీఏ), జి. కార్తీక్ (ఓఎస్)తో పాటు పలువురు పాడి రైతులు పాల్గొన్నారు

Views: 7

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

వట్టెం గ్రామంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై అవగాహన కల్పించిన సర్పంచ్ జ్యోతి శంకర్ మరియు బీజేపీ మండల నాయకులు వట్టెం గ్రామంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై అవగాహన కల్పించిన సర్పంచ్ జ్యోతి శంకర్ మరియు బీజేపీ మండల నాయకులు
*బిజినపల్లి :  బిజినపల్లి మండలంలోని వట్టెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి...
టీజీఎస్nఆర్టీసీ రీజియన్లో రోడ్డు భద్రత ప్రమాదాల నివారణపై శిక్షణ కార్యక్రమం
ఫత్లాపూర్‌లో పౌర హక్కుల దినోత్సవం
స్క్రాప్ దుకాణం ప్రారంభించిన పాలకుర్తి సారంగపాణి
చెరువులో పడిన వ్యక్తి మృతి
అల్లాదుర్గంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
ఇంటర్ జోనల్ టీ20లో మెదక్ పోలీసుల సత్తా