మారేపల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం.. ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభం, జెడ్పీహెచ్ఎస్ నూతన భవనానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి

మారేపల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం.. ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభం, జెడ్పీహెచ్ఎస్ నూతన భవనానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి

 

తిమ్మాజీపేట :  తిమ్మాజీపేట మండలం మారేపల్లి గ్రామంలో శుక్రవారం అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశం:
మొదటగా గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి, లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో ఇండ్ల నిర్మాణం నిలిచిపోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పేదల సొంత ఇంటి కలను నిజం చేస్తుందని అన్నారు.

జెడ్పీహెచ్ఎస్ నూతన భవనానికి భూమి పూజ:
అనంతరం అదే గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవన నిర్మాణానికి వేదమంత్రాల మధ్య శిలాఫలకాన్ని ఆవిష్కరించి భూమి పూజ చేశారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, గత ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైన ప్రభుత్వ పాఠశాలలకు ఇప్పుడు మహర్దశ పట్టిందని తెలిపారు. విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నిధులు మంజూరు చేయించామని, త్వరలోనే భవనాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు. ఈ రెండు కార్యక్రమాల్లో మండల అధ్యక్షులు వివేక్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్ రాం రెడ్డి, గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Views: 18

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

రైతులకు ప్రధానమంత్రి కిసాన్ నిధులను విడుదల చేసిన మోడీ. రైతులకు ప్రధానమంత్రి కిసాన్ నిధులను విడుదల చేసిన మోడీ.
  బాన్సువాడ :  ప్రధానమంత్రి కిసాన్ నిధులను శుక్రవారం విడుదల చేసిన మోడీ. దేశ ప్రధాని నరేంద్ర మోదీ   గుజరాత్ లో ప్రధాన మంత్రి కిసాన్ ఉత్సవ
బి.పి., షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు - నవంబర్ 1న నాగర్ కర్నూల్ లో వైద్య శిబిరం: డా. మణికంఠ జగదీష్
షంషీర్ నగర్ స్మశాన వాటికలో అక్రమ షెడ్డు తొలగింపు
పోచమ్మ ఆలయ గద్దెల కూల్చివేతపై బస్తీవాసుల ఆగ్రహం!
రాళ్లతో దాడి బాధితుడికి న్యాయం చేయాలి
భూ రీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి
పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పెద్దకొత్తపల్లి మండలం చెన్నాపురావుపల్లిలో ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్