భగీరథ నీరు రంగు మార్పు.. ప్రజల్లో ఆందోళన
శివంపేట,(మెదక్) : శివంపేట మండలంలోని పలు గ్రామాలకు సరఫరా అవుతున్న మిషన్ భగీరథ తాగునీరు రంగు మారి రావడంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల నీరు మట్టి కలిసినట్లు కనిపిస్తుండటంతో తాగడానికి, వంటకు ఉపయోగించేందుకు ప్రజలు వెనుకంజ వేస్తున్నారు. కలుషిత నీటి వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నీటి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించాలని, పైప్‌లైన్‌లో ఏర్పడిన లోపాలను గుర్తించి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని వారు కోరుతున్నారు. మరోవైపు, తాగునీటి నాణ్యతపై అధికారులు స్పష్టత ఇవ్వాలని, ప్రజలకు స్వచ్ఛమైన భగీరథ నీటిని అందించేలా తక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


