ఢిల్లీలో కాదు… గల్లీలో తేల్చుకుందాం
మంత్రి పొన్నం ప్రభాకర్‌కు బహిరంగ సవాల్
పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్
బీజేపీ జిల్లా కార్యదర్శి. సిద్ధిపేట
హుస్నాబాద్ : ఈ నెల 1వ తేదీన ఓటు చోరీ జరిగిందని ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో నిరసన కార్యక్రమం చేసినారని,ముందుగా ఆధారాలు చూపించాలని సిద్దిపేట జిల్లా బీజేపీ జిల్లా కార్యదర్శి పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్ డిమాండ్ చేశారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ ఓటు చోరీ జరిగింది కారణం లేకుండా ఒక్క అర్హుడి ఓటు తొలగించినట్లు నిరూపిస్తే తన రాజకీయ బాధ్యతకు రాజీనామా చేయడానికి సిద్ధమనీ,అదే విధంగా కాంగ్రెస్ ఆరోపణల్లో నిజం లేదని తేలితే మంత్రి పొన్నం ప్రభాకర్ తన మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమా? అని ప్రశ్నించారు.దమ్ముంటే చర్చకు రావాలి… ఢిల్లీలో కాదు, గల్లీలోనే ఆధారాలతో తేల్చుకుందాం! అని సవాల్ విసిరారు.ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అంతర్జాతీయ స్థాయిలో గౌరవాన్ని, అభివృద్ధిని సాధిస్తుంటే కాంగ్రెస్ మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు, గ్యాస్ కొరత, రైతుల సమస్యలు, సర్ ప్రక్రియ,ఓటు చోరీ ఆరోపణల పేరుతో ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోందని విమర్శించారు.
తెలంగాణలో రైతులకు యూరియా సరఫరా చేయడంలో ఎదురవుతున్న సమస్యలకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని, కేంద్రంపై నిందలు వేయకుండా వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు.ఓటర్ల జాబితాలో పారదర్శకత ఉండాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని, అక్రమ నమోదులు ఉంటే తొలగించాలని స్పష్టం చేశారు. అయితే ఆధారాలు లేకుండా ఎన్నికల వ్యవస్థపై ఆరోపణలు చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు.కాంగ్రెస్ నాయకులకు అభివృద్ధిపై చర్చించే ధైర్యం ఉందా? మోదీ ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు… దేశానికి మీరు చూపించే ప్రత్యామ్నాయం ఏమిటో చెప్పాలని పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్ ప్రశ్నించారు.ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలకు కాలం చెల్లిందని,దేశ అభివృద్ధి, రైతుల సంక్షేమం, యువత భవిష్యత్తు, దేశ భద్రతే బీజేపీ ప్రధాన లక్ష్యాలని ఆయన పేర్కొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


