ప్రతి ఒక్క కాంగ్రెస్ ప్రజా ప్రతినిధి పట్టభద్రుల ఓటును నమోదు చేయించాలి
నాగర్ కర్నూల్ జిల్లా, (ఫోటో జర్నలిస్ట్ మల్లేష్ బాబు) నవంబర్ 2,ప్రస్తుత సమయంలో రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచులు ప్రజాప్రతినిధులు పట్ట భద్రులందరినీ ఓటు నమోదు చేయించాలని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండ పర్వతాలు పిలుపి చ్చారు, సోమవారం తెలకపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు పర్వతాలు మాట్లాడారు, డిగ్రీలు చదివిన యువతీ యువకులు తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకొని వచ్చే సంవత్సరం మార్చి నెలలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్సాహంగా పాల్గొని ఓటు వేయాలని కోరారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని తెలిపారు, విద్యుత్ సమస్యతో ఇబ్బందులు తలెత్తకుండా రైతులను దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి పెద్దపల్లిలో విద్యుత్ ఉపకేంద్రాన్ని మంజూరు చేశారని పర్వతాలు తెలిపారు , పర్వతాపూర్ గ్రామంలో కూడా విద్యుత్ ఉప కేంద్రాన్ని మంజూరు చేయాలని ఎమ్మెల్యేను కోరినట్టు చెప్పారు సర్పంచులు కొమ్ము చంద్రశేఖర్ స్వామి ఉప సర్పంచ్ బాల గౌడ్, రవీందర్ రెడ్డి రాములు శివ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


