విద్యార్థుల కు పోక్సో చట్టం పై అవగాహన కల్పించడం జరిగింది.

ప్యారా లీగల్ వాలంటీర్లు పుష్పవతి, రామకృష్ణారెడ్డి లక్ష్మణ్, ఆధ్వర్యం లో విద్యార్థిని విద్యార్థుల కు అవగాహన కల్పించారు......

విద్యార్థుల కు పోక్సో చట్టం పై అవగాహన కల్పించడం జరిగింది.

బాన్సువాడ : విద్యార్థుల కు ఫోక్సో చట్టం పై గురువారం అవగాహన కల్పించడం జరిగింది. బాన్సువాడ మండల కేంద్రం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ( బాలుర) బాన్సువాడ యందు మండల న్యాయ సేవ అధికార కమిటీ ప్యారా లీగల్ వాలంటీర్ల ఆధ్వర్యం లో విద్యార్థి ని విద్యార్థుల కు ఫోక్సో చట్టంపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భం లో ప్యారా లీగల్ వాలంటీర్లు పుష్పావతి , రామకృష్ణారెడ్డి లక్ష్మణ్ విద్యార్థి ని విద్యార్థుల కు అభాగ్యులైన, అమాయకు లైన బాల బాలికలను లైంగిక వేధింపుల నుండి రక్షించడానికి ఫోక్సో చట్టం 2012 లో తీసుకు రావడం జరిగిందని తెలిపారు. అలాగే ఫోక్సు చట్టం సవరణ 2019 ప్రకారం చట్టం ద్వారా శిక్ష పడిన వ్యక్తికి కనీసం ఐదు సంవత్సరాల నుండి యావ జీవం వరకు ఉంటుందని తెలిపారు. లైంగిక వేధింపులు గాని లైంగిక దాడి కానీ జరిగినప్పుడు 112 కాల్ చేయడం లేదా మీకు మిక్కిలి స్నేహం గా ఉన్న ఉపా ధ్యాయుడు, ఉపాధ్యాయు నితో తెలియ జేయాలి అని తెలిపారు. సమాచారం ఇచ్చిన వ్యక్తి వివరాలు అత్యంత గోపనీయత (అనగా చాలా సీక్రెట్ గా) కలిగి ఉంటాయి అని తెలిపారు. ఈ కార్యక్రమం లో ప్యారా లీగల్ వాలంటీర్లు నాగులగామ సాయిబాబా జెడ్ పి హెచ్ ఎస్ బాయ్స్ బాన్సువాడ హెడ్ విషెస్ మెరుగురాణి, ఉపాధ్యాయులు గాయత్రి, చాంగు భాయ్, బాలాజీ, పి ఈ టి సురేందర్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Views: 5

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

రైతులకు ప్రధానమంత్రి కిసాన్ నిధులను విడుదల చేసిన మోడీ. రైతులకు ప్రధానమంత్రి కిసాన్ నిధులను విడుదల చేసిన మోడీ.
  బాన్సువాడ :  ప్రధానమంత్రి కిసాన్ నిధులను శుక్రవారం విడుదల చేసిన మోడీ. దేశ ప్రధాని నరేంద్ర మోదీ   గుజరాత్ లో ప్రధాన మంత్రి కిసాన్ ఉత్సవ
బి.పి., షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు - నవంబర్ 1న నాగర్ కర్నూల్ లో వైద్య శిబిరం: డా. మణికంఠ జగదీష్
షంషీర్ నగర్ స్మశాన వాటికలో అక్రమ షెడ్డు తొలగింపు
పోచమ్మ ఆలయ గద్దెల కూల్చివేతపై బస్తీవాసుల ఆగ్రహం!
రాళ్లతో దాడి బాధితుడికి న్యాయం చేయాలి
భూ రీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి
పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పెద్దకొత్తపల్లి మండలం చెన్నాపురావుపల్లిలో ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్