పేదింటి స్వంత ఇంటి కళ ఇందిరమ్మ రాజ్యంతోనే సాకారం అయింది-స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

పేదింటి స్వంత ఇంటి కళ ఇందిరమ్మ రాజ్యంతోనే సాకారం అయింది-స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

ధర్మసాగర్ మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా 92లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సిసి రోడ్లు ప్రారంభోత్సవంతో పాటు నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులతో కలిసి ప్రారంభించారు..
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ...
పేద ప్రజల స్వంత ఇంటి కళను సాకారం చేసింది కాంగ్రేస్ ప్రభుత్వం మాత్రమే అని అన్నారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా రెండేళ్లలోనే 35వేల కోట్లతో 7లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిన ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అంటూ ఎన్నో గొప్పలు చెప్పిన గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఇంత పెద్ద ధర్మసాగర్ మేజర్ గ్రామ పంచాయతీలో ఒక్క ఇల్లు అయినా ఇచ్చిందా అని ప్రజలను అడిగారు. కానీ నేను ఎమ్మెల్యే అయిన ఈ రెండున్నర ఏళ్లలో 2కోట్ల అభివృద్ధి పనులు చేశానని ఇవాళ ఒక్క రోజే 92లక్షల పనుల ప్రారంభోత్సవం చేసుకున్నామని అన్నారు. గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు మండల కార్యాలయాల సముదాయం, జూనియర్ కళాశాల, ధర్మసాగర్ రిజర్వాయర్ ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు.
దేశ వ్యాప్తంగా ఎల్ నీనో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని ఎలాంటి పరిస్థితుల్లో దేవాదుల పథకం ఉమ్మడి వరంగల్ జిల్లా సాగు నీరు, త్రాగు నీటికి పెద్దదిక్కుగా నిలుస్తుందని అన్నారు. నా రాజకీయ జీవితంలో అత్యంత సంతృప్తి కలిగించిన పని దేవాదుల ప్రాజెక్ట్ అని అన్నారు. దేవాదుల ఎత్తిపోతల పథకం మొదటి దశలో ధర్మసాగర్ రిజర్వాయర్ లోకే గోదావరి జలాలు చేరుతాయాని తెలిపారు. ఇక్కడి నుండే స్టేషన్ఘనపూర్, నవాబ్ పేట, అశ్వరావుపల్లి, గండి రామారం, చిటకోడూరు, బొమ్మకూరు రిజర్వాయర్లకు కూడా నీటిని పంపింగ్ చేయడం జరుగుతుందని చెప్పారు. దేవాదులలోని 10పంపులను 100రోజులు నిరంతరాయంగా నడిపించి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు, రైతులకు సాగు నీరు, త్రాగు నీరు అందించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామని వెల్లడించారు.
ధర్మసాగర్ గ్రామంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని అన్నారు. రెండో విడతలో ధర్మసాగర్ గ్రామానికి 100ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో గుడిసెలు, పెంకుటిల్లు, కవర్లు కప్పుకొని, రేకుల ఇళ్లలో ఉంటున్న అర్హులైన పేద ప్రజలకు రాజకీయాలకు అతీతంగా చేరేలా చూడాలని ప్రజా ప్రతినిధులకు, అధికారులకు సూచించారు. ఓఆర్ఆర్ నుండి ఎల్కుర్తి క్రాస్ వరకు నాలుగు లైన్ల రహదారి గా ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నట్లు దీనికి గ్రామ ప్రజలు సహకరించి ముందుకు వస్తే రోడ్డు నిర్మాణం చేసే బాధ్యత నాదని హామీ ఇచ్చారు. అలాగే ధర్మసాగర్ రిజర్వాయర్ ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు..
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మాచర్ల జ్యోతి ఏలీయా, తహసీల్దార్, ఎంపిడివో, హౌసింగ్ డిఈ, వివిధ గ్రామాల సర్పంచులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..
Views: 70

About The Author

VIJAY SRIRAMULA Picture

 విజయ్ శ్రీరాముల.  ప్రొఫెషనల్ వెబ్ న్యూస్ కంటెంట్ రైటర్‌. డిజిటల్ మీడియా ద్వారా సమాచారాన్ని సమర్థవంతంగా చేరవేయడంలో . కరెంట్ అఫైర్స్, స్థానిక మరియు అంతర్జాతీయ వార్తలు, సాంకేతికత, మరియు వ్యాపార రంగాలకు సంబంధించిన తాజా విషయాలను లోతుగా పరిశోధించి, పాఠకులకు సులభంగా అర్థమయ్యే రీతిలో డిజిటల్ కంటెంట్‌ను రూపొందిస్తాను

Tags:
Error on ReusableComponentWidget

Latest News

గ్లోబల్ ఫుడ్ ప్రాసెసింగ్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్- రాష్ట్ర మంత్రి టి.జి. భరత్ గ్లోబల్ ఫుడ్ ప్రాసెసింగ్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్- రాష్ట్ర మంత్రి టి.జి. భరత్
*"గ్లోబల్ ఫుడ్ ప్రాసెసింగ్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్:* *17వ ‘ఫుడ్ వరల్డ్ ఇండియా 2026’ సదస్సులో రాష్ట్ర మంత్రి టి.జి. భరత్ *దేశ ఆహార శుద్ధి రంగంలో 9%...
వికలాంగ విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యం- సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
తెలంగాణ రాష్ట్రంలో క్రీడా రంగ అభివృద్ధిపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
తెలంగాణ సహకార రంగం పనితీరుపై ఇరాన్ ప్రతినిధి బృందానికి వివరించిన -మంత్రి తుమ్మల
కొత్త భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు 'బిమ్‌స్టెక్' దేశాలు గట్టిగా కలిసి పనిచేయాలి: ఎన్‌ఎస్‌ఏ అజిత్ డోభాల్ పిలుపు
పేదింటి స్వంత ఇంటి కళ ఇందిరమ్మ రాజ్యంతోనే సాకారం అయింది-స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఎల్ నినో.. ఎఫెక్ట్ !! ​కరవొస్తోంది.. జాగ్రత్త!