నాగర్ కర్నూల్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ - మురాసు తుపాను ఎఫెక్ట్

నాగర్ కర్నూల్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ - మురాసు తుపాను ఎఫెక్ట్

నాగర్‌కర్నూల్ : బంగాళాఖాతంలో ఏర్పడిన మురాసు తుపాను ప్రభావంతో నాగర్‌కర్నూల్ జిల్లాకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ తెలిపారు. నవంబర్ 2 ఉదయం 8:30 నుంచి నవంబర్ 3 ఉదయం 8:30 వరకు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, నవంబర్ 3, 4 తేదీల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశామని కలెక్టర్ తెలిపారు. నవంబర్ 2 రాత్రి నుంచి 3 తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్ తీరం (నెల్లూరు - ఒంగోలు మధ్య) వద్ద తుపాను తీరాన్ని దాటనుందని వెల్లడించారు. గంటకు 60-90 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.

కలెక్టర్ సూచనలు: అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని, చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడవద్దని, వాగులు, వంకలు దాటవద్దని, రైతులు, పశువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సహాయం కోసం హెల్ప్‌లైన్ 08540-230201 కు సంప్రదించాలని కోరారు

Views: 97

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఈ నెల 3న విద్యుత్ వినియోగదారుల దినోత్సవం ఈ నెల 3న విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
అందోల్ : పాపన్నపేట సబ్ డివిజన్ పరిధిలోని 4 మండలాలకు చెందిన ఈ నెల 3న విద్యుత్ వినియోగదారుల దినోత్సవం నిర్వహించనున్నట్లు ఏఈ నవాజ్ ప్రకటించారు.ఈ మేరకు...
చౌటకూర్‌లో ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ విద్యకు శ్రీకారం
కోయిలకొండ మండలంలో దారుణం.. చింతల్ తాండాలో మహిళ హత్య! ‎
డాన్స్ మాస్టర్ శేఖర్‌ను పరామర్శించిన జర్నలిస్టులు
కుక్కలు అడ్డురావడంతో అదుపుతప్పిన బైక్.. యువకుడికి తీవ్ర గాయాలు
మృతుని కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు
పాలెం వెంకటేశ్వర స్వామి ఆలయ భూములకు డిజిటల్ సర్వే