టావేరా బైక్ ఢీకొని ఇద్దరు యువకులు మృతి

చెన్నారం–హాజీపూర్ మధ్య ఘోర ప్రమాదం.. నుజ్జునుజ్జయిన బైక్

టావేరా బైక్ ఢీకొని ఇద్దరు యువకులు మృతి

అచ్చంపేట ( నాగర్ కర్నూల్ జిల్లా)  :  హైదరాబాద్‌–శ్రీశైలం జాతీయ రహదారి 765 ప్రధాన రోడ్డుపై ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ సంఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు అచ్చంపేట మండలంలో చెన్నారం–హాజీపూర్ గ్రామాల మధ్య  ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులను టావేరా వాహనం ఢీకొట్టడంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు.    ప్రమాదంలో మృతిచెందిన వారిని బిజినేపల్లి మండలం వెలుగొండకు చెందిన వంశీ, భూత్పూర్ మండలం, చేగుంటకు చెందిన మహేష్‌గా గుర్తించారు. వీరిద్దరూ ఉప్పునుంతల మండలం, రాయిచెడు గ్రామంలో భవన నిర్మాణ మేస్త్రీలుగా పనిచేస్తున్నారు. పనులు ముగించుకుని తిరిగి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు ఈ ప్రమాద.  సమాచారం అందుకున్న అచ్చంపేట ఎస్సై నరేష్ పోలీసు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదంలో బైక్ పూర్తిగా ధ్వంసం కాగా, టీఎస్08 క్యూ 1667 నంబరు గల టావేరా వాహనం ముందు భాగం దెబ్బతింది. మృతదేహాలను అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఈ నెల 3న విద్యుత్ వినియోగదారుల దినోత్సవం ఈ నెల 3న విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
అందోల్ : పాపన్నపేట సబ్ డివిజన్ పరిధిలోని 4 మండలాలకు చెందిన ఈ నెల 3న విద్యుత్ వినియోగదారుల దినోత్సవం నిర్వహించనున్నట్లు ఏఈ నవాజ్ ప్రకటించారు.ఈ మేరకు...
చౌటకూర్‌లో ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ విద్యకు శ్రీకారం
కోయిలకొండ మండలంలో దారుణం.. చింతల్ తాండాలో మహిళ హత్య! ‎
డాన్స్ మాస్టర్ శేఖర్‌ను పరామర్శించిన జర్నలిస్టులు
కుక్కలు అడ్డురావడంతో అదుపుతప్పిన బైక్.. యువకుడికి తీవ్ర గాయాలు
మృతుని కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు
పాలెం వెంకటేశ్వర స్వామి ఆలయ భూములకు డిజిటల్ సర్వే