భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై ఉద్యమం.

వరంగల్ డిక్లరేషన్ హామీలను అమలు చేయాలి – పెండింగ్ రుణమాఫీ, రైతు భరోసా వెంటనే చెల్లించాలి.

భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై ఉద్యమం.

సంగారెడ్డి జిల్లా చౌటకూర్,పుల్కల్ మండలంలోని తహసీల్దార్ కార్యాలయం' కార్యక్రమానికి పిలుపు తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన  హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ – తెలంగాణ డిమాండ్ చేసింది. ఈ మేరకు రైతుల హక్కుల సాధన కోసం 'చలో తహసీల్దార్ కార్యాలయం' కార్యక్రమానికి పిలుపునిచ్చింది.
వరంగల్ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీల ప్రకారం రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ పూర్తి చేయాలని, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందించాలని, అన్ని పంటలకు మద్దతు ధరతో పాటు బోనస్ చెల్లించాలని కోరింది. రైతు భరోసా బకాయిలు, భూమిలేని వ్యవసాయ కూలీలకు ఆర్థిక సహాయం వెంటనే అందించాలని డిమాండ్ చేసింది.అలాగే రైతు బీమా, పంటల బీమా, పశువుల బీమా అమలు చేయాలని, పోడు, అసైన్డ్ భూములకు హక్కులు కల్పించాలని, రైతుల పట్టా భూములను 22-A జాబితా నుంచి తొలగించాలని కోరింది. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరందించాలని, వ్యవసాయ భూములకు రహదారి సౌకర్యం కల్పించాలని పేర్కొంది.
అడవి జంతువుల నుంచి పంటలను రక్షించడంతో పాటు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని, ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే కరువు పరిస్థితులను ముందుగానే అంచనా వేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేసింది. మూతబడిన చక్కెర కర్మాగారాలను పునఃప్రారంభించి, చెరకు ధరను టన్నుకు రూ.5 వేలకు పెంచాలని కోరింది. ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంగ్ జిల్లా నాయకులు యాదగిరి రెడ్డి గారు, నరసింహారెడ్డి గారు కనకా రెడ్డి గారు సదానంద రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కిషన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

WhatsApp Image 2026-10-26 at 3.41.42 PM (1)

Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పాలెం శాఖలో ఏబీవీపీ నూతన కమిటీ ఎన్నిక పాలెం శాఖలో ఏబీవీపీ నూతన కమిటీ ఎన్నిక
పాలెం(నాగర్ కర్నూల్) : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) పాలెం శాఖ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. జిల్లా కన్వీనర్ శాంతన్ ఆధ్వర్యంలో శ్రీ...
అర్షణపల్లి శివారులో భూముల రీ-సర్వే రైతులు సహకరించాలి.. భూ వివరాల నమోదును సక్రమంగా పరిశీలించాలి.
దండుపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
పెద్దగొట్టిముక్కలలో విద్యార్థులకు షూస్ పంపిణీ
అంబర్‌పేట మహంకాళి ఆలయంలో వనదుర్గ మహా రుద్ర యాగం, వరుణ యాగం.
జీడికల్‌లో పట్టభద్రుల ఓటరు నమోదుపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి
విద్యార్థులకు అల్పాహారం