కాంగ్రెస్ బహిష్కృత నాయకుడు భార్గవ్ దేశ్ పాండే వ్యాఖ్యలను ఖండించిన జిల్లా కాంగ్రెస్ కమిటీ — డా. నరేష్ జాదవ్

*కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, సి ఎం రేవంత్ రెడ్డి పై మాట్లాడే నైతిక హక్కు భార్గవ్ కు లేదు: డీసీసీ అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్

కాంగ్రెస్ బహిష్కృత నాయకుడు భార్గవ్ దేశ్ పాండే వ్యాఖ్యలను ఖండించిన జిల్లా కాంగ్రెస్ కమిటీ —  డా. నరేష్ జాదవ్

ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి, ఇక్కడి ప్రజల సంక్షేమం, ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం గురించి నిజంగా ఆలోచించే వ్యక్తి అయితే, గతంలోనే ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలపై నిరంతరం పోరాడి ఉండేవారని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు *డా. నరేష్ జాదవ్  * పేర్కొన్నారు. ప్రజల సమస్యలపై క్షేత్రస్థాయిలో పనిచేయకపోవడంతో ఆనాడే కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిందని, కాంగ్రెస్ పార్టీతో ప్రస్తుతం సంబంధం లేని వ్యక్తిగా ఉంటూ పార్టీ నాయకత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు.
భార్గవ్ దేశ్ పాండే గతంలో కాంగ్రెస్ పార్టీతో అనుబంధం కలిగి ఉన్న సమయంలో, ఆయన చేసిన పార్టీ కార్యక్రమాలను గుర్తించి 2014లో ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అవకాశం కల్పించడంతో పాటు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు కూడా అప్పగించడం జరిగింది. అయితే, పార్టీ ఆశయాలకు, క్రమశిక్షణకు అనుగుణంగా నిరంతరం పనిచేయాల్సిన సమయంలో పార్టీ పట్ల స్థిరమైన నిబద్ధతను చూపకాపోవడంతో ఆనాడే కాంగ్రెస్ పార్టీ నుండి భార్గవ్ దేస్పండేను సస్పెండ్ చేసిందని, నరేష్ జాదవ్* తెలిపారు.. కాంగ్రెస్ పార్టీతో ఆయనకు ఉన్న గత అనుబంధాన్ని ప్రస్తావిస్తూ, నేడు అదే పార్టీ సిద్ధాంతాల గురించి, అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గురించి విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ సంక్షేమ పాలన అందిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం, అర్హులైన కుటుంబాలకు రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, రూ.500కే గ్యాస్ సిలిండర్, అర్హత కలిగిన గృహాలకు ఉచిత విద్యుత్, మహిళా సాధికారత కోసం మహిళా శక్తి కార్యక్రమాలు వంటి అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూరుతోంది. రైతుల సంక్షేమానికి, వారి పంటలకు గిట్టుబాటు ధరతో పాటు పంటల కొనుగోళ్లలో తగిన మద్దతు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమలు చేసేందుకు కృషి చేస్తున్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందిస్తూ, సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన ప్రతి కుటుంబాలకు నెలకు 5 నుండి 10 వేల రూపాయలు నెలకు ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చే దిశగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోంది.
ఇలాంటి ప్రజా సంక్షేమ పాలనను పక్కనపెట్టి, ముఖ్యమంత్రి పై, కాంగ్రెస్ పార్టీపై నిరాధారమైన విమర్శలు చేయడం తగదని డా. నరేష్ జాదవ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అనేది కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని, అది ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, సమానత్వం, పేదల సంక్షేమం కోసం పోరాడే ప్రజా ఉద్యమమని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని విమర్శించే ముందు పార్టీ కోసం చేసిన సేవలను, ప్రజల కోసం చేసిన కృషిని ఆత్మపరిశీలన చేసుకోవాలనీ. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నాలను జిల్లా కాంగ్రెస్ కమిటీ సహించబోదని ఆయన హెచ్చరించారు. భవిష్యత్తులోనూ కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని లక్ష్యంగా చేసుకుని అసత్యమైన, అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజాస్వామ్య పద్ధతుల్లో తగిన రీతిలో స్పందిస్తారని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై విమర్శలు చేయడం కంటే, ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి, నిరుద్యోగ యువత సమస్యల పరిష్కారానికి, రైతుల సంక్షేమానికి, పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేయాలని భార్గవ్ దేశ్ పాండేకు డా. నరేష్ జాదవ్ హితవు పలికారు.
చివరిగా, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు, నాయకత్వానికి, ప్రజా సంక్షేమ లక్ష్యాలకు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.

Views: 11

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు! అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు!
తెలంగాణ ఉద్యమకారుల సమస్యలు, హామీలను వెంటనే అమలు చేయాలహుస్నాబాద్ లో తెలంగాణ ఉద్యమకారులను అరెస్టు చేయడం శోచనీయమని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కి చెందిన ఉద్యమకారులు తెలిపారు....
హలో నేతకాని.. ఛలో ఉస్మానియా’కు దుర్గం చిన్నయ్య మద్దతు.
నేడు బాన్సువాడ కు మంత్రి సీతక్క రాక.
మహేష్ కుమార్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కాట శ్రీనివాస్ గౌడ్.
చౌటకూర్‌లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు.
మాజీ సర్పంచి మృతికి.
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో BC కులసంఘాల రౌండ్ టేబుల్ సమావేశం.