నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరు

WhatsApp Image 2026-10-11 at 4.58.11 AM

ఢిల్లీలో విద్యార్థి సంఘాల నాయకుల అరెస్టులను ఖండించిన ఏఐపీఎస్‌యూ

బైంసా  (నిర్మల్) : నిరంకుశ పాలకుల నిర్బంధాలతో ప్రజా ఉద్యమాలను ఆపలేరని ఏఐపీఎస్‌యూ నిర్మల్ జిల్లా కార్యదర్శి గడపాలి పరమేష్ అన్నారు. ఢిల్లీలో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడం, గృహ నిర్బంధంలో ఉంచడం, అక్రమంగానిర్బంధించడాన్ని ఏఐపీఎస్‌యూ నిర్మల్ జిల్లా కమిటీ తరఫున తీవ్రంగా ఖండించారు.భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తోందని తాము భావిస్తున్న ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను రద్దు చేయాలని, ఎన్నికల సంఘంలో సమగ్ర సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వామపక్ష విద్యార్థి సంఘాలు ‘చలో ఢిల్లీ’ కార్యక్రమానికి పిలుపునిచ్చాయని తెలిపారు.ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు విద్యార్థి సంఘాల నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్య హక్కులను హరించడమేనని పేర్కొన్నారు. పోలీసు బలగాలతో విద్యార్థుల గొంతుకలను నొక్కాలని చూస్తే ఉద్యమాలు మరింత బలపడతాయని హెచ్చరించారు. రాజ్యాంగ హక్కులు, ప్రజాస్వామ్య విలువలకు భంగం కలిగించే చర్యలను విద్యార్థి లోకం నిరంతరం ప్రశ్నిస్తుందని స్పష్టం చేశారు.ఎన్ని నిర్బంధాలు విధించినా, ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా ప్రజా ఉద్యమాలను ఆపలేరని అన్నారు. అరెస్టు చేసిన విద్యార్థి సంఘాల నాయకులందరినీ వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువజనుల నిరసనలను ఎదుర్కోవాల్సి వస్తుందని పాలకులనుహెచ్చరించారు.

 

 

Views: 27

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఏడుపాయల్లో అంగరంగ వైభవంగా ప్రారంభమైన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు..... ఏడుపాయల్లో అంగరంగ వైభవంగా ప్రారంభమైన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు.....
పట్టువస్త్రాలు సమర్పించిన అడిషనల్ కలెక్టర్ నగేష్  పాపన్నపేట (మెదక్) : తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన శ్రీ ఏడుపాయల వనదుర్గామాత సన్నిధిలో ఆదివారం రోజు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ...
నూతన న్యాయవాదులకు ‘క్రాస్ కోడ్’ పుస్తకం ఎంతో ఉపయోగకరం..
మున్సిపల్, విద్యుత్ ఏఈ లను సస్పెండ్ చేయాలి..!
అంత్యక్రియలకు ఆర్థిక సహాయం
ప్రార్థనా మందిర అభివృద్ధికి ఆర్థిక సాయం చేసిన ఉప సర్పంచ్ రఫిక్
బాల త్రిపుర సుందరి దేవి అలంకరణలో దుర్గాదేవి..  
ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ సహాయం..