ఎగువ మానేరు జలాశయం నుండి యాసంగి పంటలకు నీటిని విడుదల చేయాలి

ఎగువ మానేరు జలాశయం నుండి యాసంగి పంటలకు నీటిని విడుదల చేయాలి

గంభీరావుపేట : ఎగువ మానేరు జలాశయం నుండి యాసంగి పంటలకు నీటిని విడుదల చేయాలని పరివాహక ప్రాంత రైతులు గంభీరావుపేట మండల కేంద్రంలో తెలంగాణ స్తూపం వద్ద రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తారోకో నిర్వహించారు. జలాశయంలో నిండుకుండల నీరు ఉన్నాయని అయినా నీటిని విడుదల చేయడం లేదని, యాసంగి పంటలకు నీటిని విడుదల చేయాలని రైతుల డిమాండ్ చేశారు. ఎస్సై ఆర్. బాలరాజు ధర్నా వద్దకు చేరుకొని రైతులకు సముదాయించి ధర్నా విరమింప చేశారు. అనంతరం తాసిల్దార్ కార్యాలయం కెళ్ళి తాసిల్దార్ మారుతీ రెడ్డికి రైతులు వినతిపత్రం సమర్పించారు. ఇట్టి కార్యక్రమంలో ఆయకట్టు రైతులు ఎడబోయిన రాజు, ఆకునూరి రాజేందర్, ఎండ్రాల రవీందర్ రావు,ఆకునూరి శ్రీనివాస్, కముటం వెంకట్, పిట్ల నర్సింలు , పురం రాము, దుద్దెడి నారాయణ,గుండెల్లి కళ్యాణ్,పంపరి మహేష్ ,దాసరి చెంద్రం, తోట్ల మల్లేష్ యాదవ్, జక్కుల నవీన్ నవీన్ తో పాటు పలు రైతులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఎగువ మానేరు జలాశయం నుండి యాసంగి పంటలకు నీటిని విడుదల చేయాలి ఎగువ మానేరు జలాశయం నుండి యాసంగి పంటలకు నీటిని విడుదల చేయాలి
గంభీరావుపేట : ఎగువ మానేరు జలాశయం నుండి యాసంగి పంటలకు నీటిని విడుదల చేయాలని పరివాహక ప్రాంత రైతులు గంభీరావుపేట మండల కేంద్రంలో తెలంగాణ స్తూపం వద్ద...
గాంధీ ఆసుపత్రిలో బాలుడికి ఉచితంగా కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స
అన్ని దానాల కన్న అన్నదానం గొప్పది
ఆలు లేదు - చూలు లేదు,- కొడుకు పేరు సోమ లింగం
ప్రశ్నించిన బీఆర్ఎస్ నేతలపై దాడి.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ : కోగిల మహేష్
ఇళ్లు కోల్పోతున్న ప్రతి కుటుంబానికి న్యాయం చేయాలి
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు తొమ్మిది నెలలుగా వేతనాలు లేవా?