హక్కులతో పాటు బాధ్యతలపై అవగాహన పెంపొందించుకోవాలి

రాజ్యాంగ విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి , స్ఫూర్తి ఆర్గనైజేషన్ అధ్యక్షుడు కుంటోళ్ళ యాదయ్య

హక్కులతో పాటు బాధ్యతలపై అవగాహన పెంపొందించుకోవాలి

ఘట్కేసర్ :  ఘట్కేసర్ డివిజన్‌లోని ఎన్‌ఎఫ్‌సీ నగర్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్ఫూర్తి ఆర్గనైజేషన్ అధ్యక్షుడు కుంటోళ్ళ యాదయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కుల గురించి తెలుసుకోవడంతో పాటు, ప్రతి ఒక్కరూ తమ ప్రాథమిక విధులు, సామాజిక బాధ్యతల గురించి కూడా అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. సమాజ అభివృద్ధికి శాస్త్రీయ ఆలోచనా విధానం ఎంతో అవసరమని, మూఢనమ్మకాలు, వివక్ష, సామాజిక అసమానతలకు దూరంగా ఉంటూ హేతుబద్ధమైన ఆలోచనలను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి పౌరుడు భారత రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండాలని, రాజ్యాంగం సూచించిన సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, న్యాయం వంటి విలువలను ఆచరణలో పెట్టాలని పేర్కొన్నారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు తమ అనుభవాన్ని సమాజ హితం కోసం వినియోగించాలని, సమాజాన్ని పట్టిపీడిస్తున్న సామాజిక రుగ్మతలను రూపుమాపేందుకు యువతకు మార్గదర్శకులుగా నిలుస్తూ మార్పు దిశగా కృషి చేయాలని కోరారు. అనంతరం స్ఫూర్తి ఆర్గనైజేషన్ తరఫున భారత రాజ్యాంగ గ్రంథాన్ని సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ప్రతినిధులకు బహూకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటీసి జంపాల రమేష్, అసోసియేషన్ అధ్యక్షుడు మల్లయ్య, సభ్యులు సూర్య కాంత్, రామయ్య, యాదగిరి, మల్లేష్, పండిట్, కృష్ణ రావు, సత్యనారాయణ, చంద్రయ్య, సత్యారావు, ఐలయ్య, వెంకటయ్య, లక్ష్మీపతి, నారాయణరెడ్డి, హరిచంద్ర, గజానంద్, తదితరులు పాల్గొన్నారు.

Views: 11

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

వరి వేయొద్దని ప్రభుత్వ సూచనలు.. అయినా వరి సాగుకే రైతుల మొగ్గు! వరి వేయొద్దని ప్రభుత్వ సూచనలు.. అయినా వరి సాగుకే రైతుల మొగ్గు!
సిద్దిపేట జిల్లా ప్రతినిధి ;  సిద్దిపేట జిల్లా మొత్తంలో రైతులు అప్పుడే నార్లు పోయడం అప్పుడే దున్నకాలు కూడా అన్ని మండలాలలో వరికోసిన రైతులు ప్రారంభించారు ప్రభుత్వం...
ఆదిలాబాద్ లోఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలి..చల్లా ధర్మారెడ్డి,మాజీ ఎమ్మెల్యే
సీతారాంపూర్ గ్రామ ప్రాథమిక పాఠశాలలో స్వయం పాలన దినోత్సవం
యానగుందిని సందర్శించిన మాజీ ఎంపీ తనయుడు రాయపాటి రంగారావు
ఎల్ నినో వల్ల తాగు నీరు, పశుసంపద పై ప్రభావం - అదనపు కలెక్టర్ నగేష్
‘అడ్డొస్తే జేసీబీలతో తొక్కిస్తాం’ జెన్కో అధికారుల బరితెగింపు బెదిరింపులు!