చౌటకూర్ మండలంలో 34 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

రూ.11.2200 లక్షల ఆర్థిక సాయం అందజేత.. పేద కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం తగ్గించడమే లక్ష్యం

చౌటకూర్ మండలంలో 34 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

చౌటకూర్, :- చౌటకూర్ మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 34 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు పంపిణీ చేశారు. మొత్తం రూ.11,22,000 విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. వైద్య చికిత్సల కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ ఆర్థిక సహాయం ఎంతో ఊరటనివ్వనుంది.వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సహకారంతో మంజూరైన ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చౌటకూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోడపట్ల గణేష్ ముదిరాజ్, మాజీ ఎంపీపీ సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 34 మంది లబ్ధిదారులకు రూ.11.22 లక్షల విలువైన చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వైద్య చికిత్సలు చేయించుకునేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఖరీదైన వైద్య చికిత్సల కారణంగా పేద, మధ్యతరగతి కుటుంబాలు అప్పులపాలవుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం వారికి కొంత ఊరటనిస్తుందని పేర్కొన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరంతరం కృషి చేస్తారని తెలిపారు. ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలుస్తూ, వైద్య చికిత్సల కోసం ఆర్థిక సహాయం అందేలా తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం పొందిన లబ్ధిదారులు ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు గ్రామ సర్పంచులు పార్కల రాంరెడ్డి, మల్లారెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి, సంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు నందికంటి రామచంద్రారెడ్డి, గీతా రమేష్, రాజశేఖర్, సంధ్యారాణి, మల్లికార్జున గౌడ్, రేణుక బాలరాజ్, మల్లేశం, అశోక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వర్కల్ రమేష్, వెండికోల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాములు, మండల యువజన సంఘం అధ్యక్షుడు సుధాకర్, కొర్పోల్ గ్రామ అధ్యక్షుడు సార సంజయ్ కుమార్, మండల ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు బాలు, గోరేమియా, చక్రపాణి, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఇళ్లు కోల్పోతున్న ప్రతి కుటుంబానికి న్యాయం చేయాలి ఇళ్లు కోల్పోతున్న ప్రతి కుటుంబానికి న్యాయం చేయాలి
సర్పంచ్ బండి స్వామి, భూ నిర్వాసితుల కమిటీ అధ్యక్షుడు, ఈజీసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్ - 1203 విత్ పర్మిషన్, 1062 విత్ ఔట్...
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు తొమ్మిది నెలలుగా వేతనాలు లేవా?
అయ్యప్ప ఆలయ అన్నదానానికి భారీ విరాళం
ఏఎంసీ పాలకవర్గం మరియు పిఏసి పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించిన కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి
అర్ధరాత్రి 100 కిలోమీటర్లు ప్రయాణించి రక్తదానం..
బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం
జిల్లాకు వచ్చిన రాష్ట్ర మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ