అర్ధరాత్రి 100 కిలోమీటర్లు ప్రయాణించి రక్తదానం..

రక్తదాన సేవలో మరోసారి మానవత్వం చాటిన ముదాం శ్రీధర్ పటేల్

అర్ధరాత్రి 100 కిలోమీటర్లు ప్రయాణించి రక్తదానం..

 పాతరాజంపేట గ్రామానికి చెందిన చీదురా సుగుణ అనే మహిళకీ కిడ్నీ సంబంధిత వ్యాధితో గజ్వేల్ దగ్గర గల ఒంటిమామిడిలోని RVM ఆసుపత్రి లో ఆపరేషన్ నిమిత్తం AB పాజిటివ్ రక్తం అత్యవసరంకాగ వారి కుటుంబ సభ్యులు ముదాం శ్రీధర్ గారినీ సంప్రదించారు. విషయం తెలుసుకున్న ముదాం శ్రీధర్ పటేల్ వెంటనే స్పందించి రక్తదానం చేసి రోగికి అండగా నిలిచారు. అత్యవసర సమయంలో సమయాన్ని, దూరాన్ని లెక్కచేయకుండా అర్ధరాత్రి స్పందించి రక్తదానం చేయడం జరిగింది. ఈ సందర్బంగా శ్రీధర్ పటేల్ ను రక్తదాతల సేవా సమితి నిర్వాహకులు బోనగిరి శివ కుమార్, సేవా సమితి ప్రతినిధి దేవరాములు,పేషంట్ కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు. అర్థరాత్రి అయినా, ఎప్పుడు రక్తం అవసరమైనా స్పందిస్తూ రక్తదానం చేయడమే కాకుండా, రక్తదాతలను అందుబాటులోకి తీసుకువస్తూ అనేక మంది ప్రాణాలను కాపాడుతున్న ముదాం శ్రీధర్ పటేల్ సేవలు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్రజల్లో రక్తదానంపై అవగాహన కల్పిస్తూ, అత్యవసర సమయాల్లో రక్తం అందించే సేవా కార్యక్రమాల్లో మరియు తన ఊరిలో ఎవరికీ ఆపద వచ్చిన తనకు తోచిన సహాయం, వస్తు రూపేణా గాని ధన రూపేణా గాని ఆయన నిరంతరం సహాయం చేస్తూ కాచాపూర్ కీ జిల్లాలోనే మంచిపేరు తీసుకువస్తున్నారు అని గ్రామ పెద్దలు చాలా మంది ముదాం శ్రీధర్ గారిని అభినందిస్తున్నారు. రక్తదానం అనేది కేవలం దానం కాదు.. ఒక కుటుంబానికి కన్నీళ్లు తుడిచి, మరో కుటుంబంలో ఆనందాన్ని నింపే ప్రాణదానం. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో మానవత్వాన్ని మరింత పెంపొందిస్తాయని పలువురు ముదాం శ్రీధర్ పటేల్ ను కొనియాడారు.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు తొమ్మిది నెలలుగా వేతనాలు లేవా? ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు తొమ్మిది నెలలుగా వేతనాలు లేవా?
హుస్నాబాద్  :  AISF ఆధ్వర్యంలో చేపట్టిన “మన బడి – మన హక్కు” కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత...
అయ్యప్ప ఆలయ అన్నదానానికి భారీ విరాళం
ఏఎంసీ పాలకవర్గం మరియు పిఏసి పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించిన కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి
అర్ధరాత్రి 100 కిలోమీటర్లు ప్రయాణించి రక్తదానం..
బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం
జిల్లాకు వచ్చిన రాష్ట్ర మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ
సైనిక స్కూళ్ల ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: