గాంధీ ఆసుపత్రిలో బాలుడికి ఉచితంగా కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స

ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ.10–12 లక్షలు ఖర్చయ్యే ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించిన వైద్యులు

గాంధీ ఆసుపత్రిలో బాలుడికి ఉచితంగా కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స

హైదరాబాద్:  పుట్టుకతోనే వినికిడి లోపంతో బాధపడుతున్న ఎనిమిదేళ్ల బాలుడికి గాంధీ ఆసుపత్రి వైద్యులు ఉచితంగా కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడకు చెందిన విహాన్ సాయికి ఈ శస్త్రచికిత్స చేశారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్‌కు సుమారు రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఖర్చవుతుందని, గాంధీ ఆసుపత్రిలో మాత్రం ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా ఈ శస్త్రచికిత్స నిర్వహించినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. పుట్టుకతోనే వినికిడి సమస్యతో బాధపడుతున్న బాలుడికి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి, శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి వైద్య బృందాన్ని అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని ఆమె తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఖరీదైన వైద్యం చేయించుకోలేని వారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో లభించే ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఎగువ మానేరు జలాశయం నుండి యాసంగి పంటలకు నీటిని విడుదల చేయాలి ఎగువ మానేరు జలాశయం నుండి యాసంగి పంటలకు నీటిని విడుదల చేయాలి
గంభీరావుపేట : ఎగువ మానేరు జలాశయం నుండి యాసంగి పంటలకు నీటిని విడుదల చేయాలని పరివాహక ప్రాంత రైతులు గంభీరావుపేట మండల కేంద్రంలో తెలంగాణ స్తూపం వద్ద...
గాంధీ ఆసుపత్రిలో బాలుడికి ఉచితంగా కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స
అన్ని దానాల కన్న అన్నదానం గొప్పది
ఆలు లేదు - చూలు లేదు,- కొడుకు పేరు సోమ లింగం
ప్రశ్నించిన బీఆర్ఎస్ నేతలపై దాడి.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ : కోగిల మహేష్
ఇళ్లు కోల్పోతున్న ప్రతి కుటుంబానికి న్యాయం చేయాలి
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు తొమ్మిది నెలలుగా వేతనాలు లేవా?