అన్ని దానాల కన్న అన్నదానం గొప్పది
కీ. శె. ఎదిరే అశోక్ కుమార్ గుప్త వర్ధంతి సందర్బంగా అన్నదాన కార్యక్రమం మక్తల్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వాసవి క్లబ్ మాజీ అధ్యక్షులు కీర్తిశేషులు ఎదిరే అశోక్ కుమార్ గుప్తా వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థం మక్తల్ స్థానిక శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర మధ్యాహ్నం 1. 30 గంటలకు ఎదిరే అశోక్ తల్లి కమలమ్మ, భార్య ఎదిరే సుధ, కుమారులు ఎదిరే శ్రీ చరణ్, సాయి రిపుత్ వారి కుటుంబ సభ్యుల సహకారం తో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఎదిరే అశోక్ గుప్త వాసవి దేవాలయం నిర్మాణం లో అలాగే వాసవి దేవాలయం వర్తక వ్యాపారం సముదాయం, ట్రాన్స్ఫర్మర్, జనరేటర్ వివిధ కార్యక్రమాలలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి వర్ధంతి రోజున అన్నదానం చేయడం వలన ఆయన ఆత్మ కు శాంతి చేకూరుతుందని, అన్ని దానాల కన్నా అన్నదానం ఎంతో గొప్పదని, సేవ చేసే భాగ్యం ప్రతి ఒక్కరికి రాదని, వాసవి క్లబ్ మాత్రం అన్ని వర్గాల వారికి సేవ చేస్తుందని ఈ సందర్బంగా వాసవి క్లబ్ సభ్యులు తెలిపారు. కార్యక్రమం లో వాసవి క్లబ్ అధ్యక్షులు మేడిశెట్టి హరికృష్ణ, మక్తల్ వనిత క్లబ్ వ్యవస్థపాక అధ్యక్షురాలు మనసాని దేవి పద్మావతి,మాజీ అధ్యక్షురాలు ఎదిరే సుధారాణి, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

