ములుగులో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
ములుగు : భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బుధవారం ములుగు జిల్లా కేంద్రంలో బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు వావిలాల జనార్ధన్ ఆధ్వర్యంలో బస్‌స్టాండ్ నుంచి ఆసుపత్రి మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రాజ్యాంగ పీఠికను సామూహికంగా పఠించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగమైన భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, సామాజిక న్యాయాన్ని కల్పించిందని అన్నారు. హక్కులతో పాటు ప్రాథమిక విధులను కూడా ప్రతి ఒక్కరూ బాధ్యతగా నిర్వర్తించాలని, యువత, విద్యార్థులు రాజ్యాంగ స్ఫూర్తితో దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భూక్యా జవహర్ లాల్, జిల్లా ప్రధాన కార్యదర్శులు నగరపు రమేష్, శ్రీమంతుల రవీంద్రాచారి, జిల్లా ఉపాధ్యక్షుడు జినుకల కృష్ణాకర్ రావు, కోశాధికారి గంగిశెట్టి రాజ్ కుమార్, మోర్చా అధ్యక్షులు దండిగె వెంకన్న, కొర్ర సుమలత, నాయకులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


