ఏఎంసీ పాలకవర్గం మరియు పిఏసి పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించిన కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి
గంభీరావుపేట : గంభీరావుపేట మండల కేంద్రంలోని ఏఎంసి ఆఫీస్ లో మార్కెట్ కమిటీ చైర్మన్ హమీద్ మరియు పాలకవర్గాన్ని, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి. అనంతరం పీఏసీ ఆఫీసులో పిఎసి చైర్మన్ వేషాల వెంకటి మరియు పాలకవర్గాన్ని కూడా సన్మానించారు. ఈ సందర్బంగా కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు అండగా నిలుస్తూ, వ్యవసాయాన్ని పండుగగా మార్చేందుకు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో మార్కెట్ కమిటీలు కీలక పాత్ర పోషించాలని అన్నారు.వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సహకారంతో రైతులకు అవసరమైన మద్దతు అందిస్తున్నామని తెలిపారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించడంలో నిర్లక్ష్యం జరిగిందని అన్నారు.కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన హమీద్‌కు మార్కెట్ కమిటీ చైర్మన్‌గా మరియు పిఎసి చైర్మన్ గా వేషాల వెంకటి ల కుఅవకాశం కల్పించడం పార్టీ కార్యకర్తలకు ఇచ్చిన గుర్తింపు అని పేర్కొన్నారు. రాబోయే రెండేళ్ల పాటు నూతన కమిటీ రైతుల సమస్యలను గుర్తించి, కొనుగోలు కేంద్రాలను సకాలంలో ప్రారంభించి, ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో,వైస్ చైర్మన్‌గా మేడ భాస్కర్, ప్యాక్స్ ఏం సి డైరెక్టర్లు లక్కిరెడ్డి మధుసూదన్ రెడ్డి, నాగపురి రమేష్ గౌడ్, శ్రీజ, పెద్ద వేణి మల్లయ్య, మరియుకాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పర్ష హన్మండ్లు,మాజీ ఏఎంసి చైర్మన్ కొమిరిశెట్టి విజయ తిరుపతి, ఏఎంసీ కమిటీ డైరెక్టర్లు, ఫ్యాక్స్ డైరెక్టర్లు, గుడి కాడి బాలయ్య, అజ్మీర భాస్కర్, కాంగ్రెస్ నాయకులు మూల రామచంద్ర రెడ్డి, దిశెట్టి రాజశేఖర్, బంగ్లా రాజు గౌడ్, టేకుమల్ల ప్రవీణ్ తో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


