రైతు సమస్యలపై కలెక్టరేట్ వద్ద ఎస్కేఎం ధర్నా : గుండెబోయిన చంద్రయ్య

రైతు సమస్యలపై కలెక్టరేట్ వద్ద ఎస్కేఎం ధర్నా : గుండెబోయిన చంద్రయ్య

ములుగు :  రైతు సమస్యల పరిష్కారం కోరుతూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో బుధవారం ములుగులో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. జాతీయ రహదారి నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి ధర్నా చేశారు. ఈ సందర్భంగా అఖిల భారత రైతు సమాఖ్య జిల్లా కార్యదర్శి గుండెబోయిన చంద్రయ్య మాట్లాడుతూ, గిట్టుబాటు ధర చట్టం తెస్తామన్న ప్రధాని హామీ నేటికీ నెరవేరలేదని అన్నారు. ఎరువులపై సబ్సిడీ తగ్గించి రైతులపై భారం పెంచారని విమర్శించారు. ములుగు జిల్లాలో గోదావరి 100 కిలోమీటర్లు ప్రవహిస్తున్నా ఇక్కడి రైతులకు సాగునీరు అందడం లేదని, గోదావరి జలాలను ములుగు రైతులకు అందించాలని డిమాండ్ చేశారు. ఎల్‌నినో ప్రభావంతో పంటలు ఎండిపోయాయని, ములుగును కరువు జిల్లాగా ప్రకటించి, రైతుల బ్యాంకు రుణాలు రద్దు చేసి, ఎండిన పంటలకు ఎకరాకు రూ.30,000 పరిహారం ఇవ్వాలని కోరారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో విదేశీ వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతి వల్ల దేశ వ్యవసాయం దెబ్బతింటుందని, నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేసి, ఉపాధి హామీ పని దినాలు 200కి పెంచి రోజుకు రూ.600 కూలి ఇవ్వాలని, విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టే ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శులు తుమ్మల వెంకటరెడ్డి, ఎండీ అంజద్ భాషా, రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి కామెడీ ఉప్పలయ్య, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Views: 12

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

వరి వేయొద్దని ప్రభుత్వ సూచనలు.. అయినా వరి సాగుకే రైతుల మొగ్గు! వరి వేయొద్దని ప్రభుత్వ సూచనలు.. అయినా వరి సాగుకే రైతుల మొగ్గు!
సిద్దిపేట జిల్లా ప్రతినిధి ;  సిద్దిపేట జిల్లా మొత్తంలో రైతులు అప్పుడే నార్లు పోయడం అప్పుడే దున్నకాలు కూడా అన్ని మండలాలలో వరికోసిన రైతులు ప్రారంభించారు ప్రభుత్వం...
ఆదిలాబాద్ లోఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలి..చల్లా ధర్మారెడ్డి,మాజీ ఎమ్మెల్యే
సీతారాంపూర్ గ్రామ ప్రాథమిక పాఠశాలలో స్వయం పాలన దినోత్సవం
యానగుందిని సందర్శించిన మాజీ ఎంపీ తనయుడు రాయపాటి రంగారావు
ఎల్ నినో వల్ల తాగు నీరు, పశుసంపద పై ప్రభావం - అదనపు కలెక్టర్ నగేష్
‘అడ్డొస్తే జేసీబీలతో తొక్కిస్తాం’ జెన్కో అధికారుల బరితెగింపు బెదిరింపులు!