చిర్ర రాజేందర్ కుటుంబానికి స్వయంకృషి ఫౌండేషన్ చేయూత

చిర్ర రాజేందర్ కుటుంబానికి స్వయంకృషి ఫౌండేషన్ చేయూత

కాటారం (భూపాలపల్లి) :  జయశంకర్ భూపాలపల్లి జిల్లా, కాటారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన చిర్ర రాజేందర్ ఇటీవల కిడ్నీ సంబంధిత వ్యాధితో అనారోగ్యానికి గురై మృతి చెందారు. ఆయన కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న స్వయంకృషి స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ కొట్టే సతీష్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక, నిత్యావసర సహాయం అందించారు. ఈ సందర్భంగా రాజేందర్ కుటుంబానికి బియ్యం, నెలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు. కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని, రాజేందర్ పిల్లల చదువుకు సహకారం అందిస్తామని, రానున్న రోజుల్లోనూ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని స్వయంకృషి ఫౌండేషన్ ఫౌండర్ కొట్టే సతీష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ మంథని డివిజన్ అధ్యక్షుడు చిట్యాల శ్రీనివాస్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బొడ్డు స్మరన్, స్వయంకృషి సభ్యులు సాయి, సుమన్, సందీప్ పాల్గొన్నారు.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

వరి వేయొద్దని ప్రభుత్వ సూచనలు.. అయినా వరి సాగుకే రైతుల మొగ్గు! వరి వేయొద్దని ప్రభుత్వ సూచనలు.. అయినా వరి సాగుకే రైతుల మొగ్గు!
సిద్దిపేట జిల్లా ప్రతినిధి ;  సిద్దిపేట జిల్లా మొత్తంలో రైతులు అప్పుడే నార్లు పోయడం అప్పుడే దున్నకాలు కూడా అన్ని మండలాలలో వరికోసిన రైతులు ప్రారంభించారు ప్రభుత్వం...
ఆదిలాబాద్ లోఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలి..చల్లా ధర్మారెడ్డి,మాజీ ఎమ్మెల్యే
సీతారాంపూర్ గ్రామ ప్రాథమిక పాఠశాలలో స్వయం పాలన దినోత్సవం
యానగుందిని సందర్శించిన మాజీ ఎంపీ తనయుడు రాయపాటి రంగారావు
ఎల్ నినో వల్ల తాగు నీరు, పశుసంపద పై ప్రభావం - అదనపు కలెక్టర్ నగేష్
‘అడ్డొస్తే జేసీబీలతో తొక్కిస్తాం’ జెన్కో అధికారుల బరితెగింపు బెదిరింపులు!