ఆలు లేదు - చూలు లేదు,- కొడుకు పేరు సోమ లింగం
బాల్కొండ నిజామాబాదు జిల్లా : ఆలు లేదు - చూలు లేదు,- కొడుకు పేరు సోమ లింగం
అన్నట్లుగా ఉంది.నీళ్ళు నిధులు ఉద్యోగాలు వస్తాయని ఆశతో తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా తెలంగాణ వ్యాప్తగా వ్యాయమ నిరుద్యోగు లు రోడ్ల మీద కబడ్డీ, ఖో - ఖో వాలీ బాల్ క్రీడలు ఆడి ఉద్య మాలు చేశామని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని నేషనల్ యూత్ ప్రాజెక్ట్ యునై టెడ్ నేషన్స్ ఆఫ్ యూత్ ఆర్గ నైజేషన్ దక్షిణ ఆసియా మైత్రి సదస్సు చైర్మన్ వి. సత్య గౌడ్ సెక్రటరీ జెనరల్ బి.ఆర్ నర్సింగ రావు శుక్రవారం పత్రికలు విడుదల చేసిన ప్రకటనలో వివరించారు.
నిరుద్యోగుల బాధలు ఎవరూ పట్టించు కొంటారు ?
తెలంగాణ రాష్ట్రంలోని వ్యాయమ విద్య నిరుద్యోగుల గోసలు " ఆచమ్య గొచారంల మారింది" తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగులు ఉద్యోగాలు రాకుండానే వయసు మీరి పోతున్నారని పిల్లల్ని కన్న తల్లి దండ్రుల ఆవేదనను తీర్చే వారు ఎవరూ ? గత టి. ఆర్. ఏస్, & బి. ఆర్. ఎస్ ప్రభుత్వ పాలనలో నిరుద్యోగులు ఉద్యగాలు రాకుండా పిట్టల్లా రాలి పోయారు.ఇది ఇలా ఉండగా గత టి. ఆర్. ఎస్ & బి.ఆర్.ఏస్ ప్రభుత్వంలో వ్యాయమ నిరుద్యోగు లను నియమించకుండ నిర్లక్ష్యం చేశారని ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా వ్యాయమ విద్య డిప్లొమా చేసిన వారు 45,763 మంది కాగ వ్యాయామంలో డిగ్రీ చేసిన వారు 32,765 , మరియు వ్యాయామంలో పీ.జి చేసిన వారు 17,223 మంది నిరుద్యో గులుగా ఉన్నారని, వ్యాయమ నీరుద్యోగులు గత అక్టోబర్ నెలలో 21,231 మంది ప్రభుత్వ ఉద్యోగాలు రాకుండానే పదవీ విరమణ అయ్యారని వారు వేదన వ్యక్తం చేసారు.ఉమ్మడి రాష్ట్రం విడి పోయిన తర్వాత ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో డీ.ఎస్. సి పెట్టలేక వ్యాయమ మరియు ఉపాధ్యాయులను నియమించ లేదు.కానీ టి. పీ. ఎస్. సి. ద్వారా మాత్రం అనేక నియా మకాలు జరిగిన వాటిల్లో అన్ని
అక్రమాలే జరిగినట్లు పైగా
గ్రూప్ I & II క్వశ్చన్ పేపర్ లు ఎలా బయటి కి వచ్చాయి ? గ్రూప్ II ఆన్సర్ షీట్స్ లపై వైట్నర్ వాడలేదా ?ఈ విషయంలో రాష్ట్ర హై కోర్ట్స్ మంద లించ లేదా ? టీ. పి. పి. ఎస్. సి.ఉద్యోగికి గ్రూప్ I పోస్ట్ ఎలా వచ్చింది ఇలాంటి నిజాలన్ని యావత్ తెలంగాణ ప్రజలకు తెలిసిందే.
ఎన్నికల హామీలు ఉట్టిదేనా ?
గత ఏం. ఎల్. ఏ ఎన్నికల హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పార్ట్ టైం కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ గెస్ట్ ఫ్యాకల్టీ వాళ్లందర్నీ రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారు. మార్పు కోసం మా పోరగాల్లకు టీచర్స్ ఉద్యోగాలు వస్తాయని
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే " ఇప్పటి దాకా ఒక్క డి. ఎస్. సి ( జిల్లా టీచర్ ఎంపిక కమిటీ) పెట్టలేదని పిల్లల్ని కన్న తల్లి దండ్రుల ఆవేదనను ఎవరూ తీరుస్తారన్నదే ప్రశ్న.
నిధుల కేటాయింపుతోనే లక్ష్యం నెరవేరుతుందా?
ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను కేవలం ఒక క్రీడా వేడుకగా కాకుండా, తెలంగాణ లో క్రీడా సంస్కృతికి పునాది అయినప్పటికీ, వాటి ఫలితాలు క్రీడాకారులకు ఎంతవరకు చేరుతాయన్నదే అసలు ప్రశ్న. స్టేడియాల నిర్మాణం, ఆధునీ కరణతోపాటు వాటి నిరంతర నిర్వహణ, నిపుణులైన కోచ్‌ల నియామకం, గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభను గుర్తించడం, యువతకు క్రమబద్ధమైన శిక్షణ అందించడం వంటి అంశాల పైనా ప్రభుత్వం దీర్ఘకాలిక దృష్టి సారించాల్సి ఉంటుందని ప్రముఖుల అభిప్రాయం ఉంది.
స్పోర్ట్స్ యూనివర్సిటీ ఎందుకు ?
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజ్ ప్రొఫెసర్ కాసిం గారు చేసిన వ్యాఖ్యలు ఎంతో ఆలోచనాత్మకంగా, భవిష్యత్ క్రీడా విధానానికి మార్గదర్శ కంగా ఉంటుందని పీ.ఈ.టీ. లు మరియు ఫిజికల్ ఎడ్యు కేషన్ వ్యవస్థ ను బలోపేతం చేసి ప్రభుత్వాలు ఇప్పటికీ పీఈటీల నియామకాలు చేపట్టకుండా, ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశా లల్లో ప్రక్షాళన చేయకుండా కేవలం స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే అది పరిపూర్ణత సాధించ దని స్పష్టంగా తెలియజేశారు.
యువతకు ఉపాధి కావాలి - క్రీడలు ఎందుకు ?
డిసెంబర్ 11 నుంచి 22 వరకు తెలంగాణలో జరగనున్న 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణ ఎందుకని యువత కు ఉపాధి కావాలని నిరుద్యో గులు కోరుచున్నారు." ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.21 కోట్లు కేటాయించగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.203 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ముఖ్య మంత్రి వెల్లడించారు.బాగానే ఉంది కానీ ఇదే డబ్బులతో
ప్రతి ఉచ్చతర ప్రైమరీ,ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులను నెలకు 10,000/- కన్సలిడేటెడ్ వేతనంతో నియమింప జేసీ
(05)సంవత్సరాల పాటు పని చేయాలనీ కోరుతే కొన్ని వేల మంది నిరుద్యోగుల కుటుంబాలు జీవించడమే కాకుండ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పేరు చిరస్తాయిగా నిలిచి పోతుందని తెలంగాణ రాష్ట్ర
వ్యాయామ విద్య మైత్రి సంగం అధ్యక్షులు సత్య గౌడ్, కార్యదర్శి బి నర్సింగరావు అభిప్రాయాన్ని తెలియజేశారు .
గ్రామీణ స్థాయిలో వ్యాయమ విద్య పటిష్టం చేయాలి
గ్రామీణ స్థాయిలో వ్యాయామ విద్యను ప్రటిష్టo చేయడానికి నిధులు మంజూరు చేయడం లేదు. దీంతో గ్రామీణ స్థాయిలో ఎందరో విద్యార్థిని విద్యార్థులు
స్వయం శక్తితో వ్యాయామంలో
అరితేరిన వారు ఉన్నారు, ఇలాంటి వారిని ప్రభుత్వం ఆధునిక పద్ధతిలో క్రీడల్లో శిక్షణ ఇస్తే జాతీయ మరియు ఒలంపిక్ పోటీలలో తెలంగాణ కీర్తి ప్రతిష్టలు ఉంటాయి ఇవేవీ కాకుండా క్రీడల పేరుతో కోట్లాది రూపాయలు వృధా చేయడం తప్పే అవుతుంది.తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమికంగా ప్రైమరి పాఠశాల స్థాయిలో వ్యాయమ విద్యను పాటిష్టం చేయకుండా, వ్యాయమ ఉపాధ్యాయులు నియమించ కుండ క్రీడల పేరుతో కొట్లాది రూపాయల నిధులు ఖర్చి చేయడం కంటే రాష్టంలోని ప్రతి అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఒక పీ. ఈ.టి.ని,ప్రతి ఉన్నత పాఠశాలల్లో స్కూల్లో ఒక పీ. ఈ.టి./ పీ. డి. తో పాటు పీ. డి./ వివిధ క్రీడా కోచ్ లని,ప్రతి జూనియర్ మరియు డిగ్రీ కళాశాలల్లో (02) పీ. డి. లతో వివిధ క్రీడా కోచ్ లని, నియమిస్తే తెలంగాణ రాష్ట్రం క్రీడల్లో రైసింగ్ తెలంగాణగ మారి పోతుంది.
ఉమ్మడి రాష్ట్రంలోనే ఉద్యోగాల జాతర
ఇది ఇలా ఉండగా 1984-85 లో మాజి ముఖ్య మంత్రి నందమూరి తరక రామా రావు హయంలో నెలకు 398/- కన్సాలిడేటెడ్ వేతనంతో ప్రతి ప్రైమరీ,ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యా యులతో పాటు వ్యాయమ ఉపాద్యా యులు నియమించి నాటి నిరుద్యోగ సమస్యను తీర్చగా నేడు ఆనాటి ఉపాద్యాయులు ఎన్.టీ.ఆర్.ను దేవునిగా కొలుస్తున్నారని సత్య గౌడ్, నర్సింగ్ రావు గుర్తు చేశారు
ఇలా చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ప్రైమరీ, ఉచ్చతర,ఉన్నత పాఠశాలలు, నెలకు రూ, 10,000/- జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలో నెలకు రూ, 25,000/- డిగ్రీ మరియు "డైట్ కళాశాలల్లో " సబ్జెక్ట్ ఉపాధ్యా యులతో పాటు వ్యాయామ డైరెక్టర్లకు రూ, 50,000/- వరకు కన్సాలిడేటెడ్ వేతనంతో నిరుద్యోగ సబ్జెక్ట్ ఉపాధ్యాయు లతో పాటు వ్యాయామ డైరెక్టర్లు గా నియమిస్తే కావున తెలంగాణ ముఖ్య మంత్రిగ మీరు ప్రత్యేక డి. ఎస్. సి ఏర్పాటు చేసి టీచర్ ట్రైనింగ్, వ్యాయామంలో డిప్లొమా, డిగ్రీ, పి. జి చేసిన వారిని అటెండర్, జూనియర్ అసిస్టెంట్,కూడా వయస్సు మీరి పోతున్న నిరుద్యోగుల్ని నియమిస్తే నిరుద్యోగ సమస్య కొంచెం అయిన తీరిపోతుంది మరో 10 మీరే ముఖ్య మంత్రి గా మీరే ఉంటారని పైగా తెలంగాణ ప్రభుత్వా అధికారంలో ముఖ్య మంత్రిగ ఉన్న మీకు మంచి పేరు వస్తుందని వి.సత్యగౌడ్, నర్సింగ్ రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


