చౌటకూర్‌లో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
చౌటకూర్ :- భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని చౌటకూర్ మండల కేంద్రంలో నవభారత యువజన సంఘం ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా రాజ్యాంగం కల్పించిన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి విలువలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా నడుచుకోవాలని పలువురు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం ప్రతి పౌరుడికి మార్గదర్శకమని, అంబేద్కర్ ఆశయాలను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ పార్కల రాం రెడ్డి , వార్డు సభ్యులు అశోక్, చక్రపాణి, నవభారత యువజన సంఘం సీనియర్ సభ్యులు గౌని కరుణాకర్, గౌని నరేష్, తలారి లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


