చౌటాకూర్ గ్రామ పంచాయతీ వద్ద ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

గ్రామ సర్పంచ్ పార్కల రాంరెడ్డి ఆధ్వర్యంలో

చౌటాకూర్ గ్రామ పంచాయతీ వద్ద ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

చౌటాకూర్ :- భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని చౌటాకూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పార్కల రాంరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని రాజ్యాంగ ఆశయాలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ పార్కల రాంరెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగాన్ని మనకు అందించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మరియు రాజ్యాంగ నిర్మాతల కృషిని కొనియాడారు. ప్రతి పౌరుడు రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ, తమ హక్కులతో పాటు బాధ్యతలను కూడా సక్రమంగా నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో రాజ్యాంగం కీలక పాత్ర పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సందీప్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ రామా గౌడ్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వర్కల రమేష్, వార్డు సభ్యులు చక్రపాణి, గంగారం, కరోబార్ కుమార్ గౌడ్, నాయకులు రాజేశ్వర్ గౌడ్, గ్రామస్థులు, యువకులు పాల్గొన్నారు.

Views: 33

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

వరి వేయొద్దని ప్రభుత్వ సూచనలు.. అయినా వరి సాగుకే రైతుల మొగ్గు! వరి వేయొద్దని ప్రభుత్వ సూచనలు.. అయినా వరి సాగుకే రైతుల మొగ్గు!
సిద్దిపేట జిల్లా ప్రతినిధి ;  సిద్దిపేట జిల్లా మొత్తంలో రైతులు అప్పుడే నార్లు పోయడం అప్పుడే దున్నకాలు కూడా అన్ని మండలాలలో వరికోసిన రైతులు ప్రారంభించారు ప్రభుత్వం...
ఆదిలాబాద్ లోఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలి..చల్లా ధర్మారెడ్డి,మాజీ ఎమ్మెల్యే
సీతారాంపూర్ గ్రామ ప్రాథమిక పాఠశాలలో స్వయం పాలన దినోత్సవం
యానగుందిని సందర్శించిన మాజీ ఎంపీ తనయుడు రాయపాటి రంగారావు
ఎల్ నినో వల్ల తాగు నీరు, పశుసంపద పై ప్రభావం - అదనపు కలెక్టర్ నగేష్
‘అడ్డొస్తే జేసీబీలతో తొక్కిస్తాం’ జెన్కో అధికారుల బరితెగింపు బెదిరింపులు!