శ్రీరాంపూర్ జీఎం కార్యాలయంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం
నస్పూర్(మంచిర్యాల), : శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) కార్యాలయంలో గురువారం భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ కార్యాలయ ప్రాంగణంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అధికారులతో, ఉద్యోగులతో కలిసిభారత రాజ్యాంగ పీఠికను సామూహికంగా పఠించారు. జీఎం మునిగంటి శ్రీనివాస్ ఈ సందర్భంగా జీఎం శ్రీనివాస్ మాట్లాడుతూ.. 175కు పైగా దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సారథ్యంలో రూపొందించిన భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న ఆమోదించుకున్నామని గుర్తుచేశారు. స్వేచ్ఛ, సమానత్వంతో పాటు ప్రజల హక్కులు, అందరికీ విద్య, వైద్యం వంటి ప్రజాస్వామిక విలువలకు మన రాజ్యాంగం పెద్దపీట వేసిందన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగం కల్పించిన హక్కులను అనుభవించడమే కాకుండా, తమ విధులు మరియు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. గనుల్లో రక్షణ నియమాలు పాటిస్తూ, క్రమశిక్షణ, నిజాయితీ, అంకితభావంతో పనిచేసి సింగరేణి సంస్థ అభ్యున్నతికి పాటుపడాలని ఉద్యోగులకు సూచించారు. ఈ వేడుకల్లో గుర్తింపు సంఘం అసిస్టెంట్ బ్రాంచి సెక్రటరీ మోతుకూరి కొమురయ్య, అధికారుల సంఘం ప్రతినిధి పద్మ, ఎస్ఓ టూ జీఎం కృష్ణ ప్రసాద్, ఐకే ఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఏ.వి. రెడ్డి, ఏజీఎం (ఫైనాన్స్) శ్రీధర్, డీజీఎం (పర్సనల్) ఎస్. అనిల్ కుమార్, డీజీఎం (ఐఈడీ) రాజన్న, ఎస్టేట్స్ మేనేజర్ వరలక్ష్మి, పర్చేజ్ ఆఫీసర్ చంద్రశేఖర్, లా ఆఫీసర్ మల్లేష్, ఏరియా సర్వేయర్ నర్సింగరావు, డీవై పీఎం క్రాంతి కుమార్, సీనియర్ ఐటీ ప్రోగ్రామర్ శ్రీనివాస్‌తో పాటు ఇతర అధికారులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

