ఎట్టకేలకు సరస్వతి నగర్‌లో తీరిన తాగునీటి సమస్య...
మిషన్ భగీరథ పైప్‌లైన్ ద్వారా నీటి సరఫరా.. స్థానికుల హర్షం...
నారాయణపేట: జిల్లా కేంద్రంలోని 3వ వార్డు సరస్వతి నగర్ కాలనీలో కొంతకాలంగా నెలకొన్న తాగునీటి సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. నీటి సరఫరా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాలనీవాసులకు శుక్రవారం ఊరట కలిగింది. మూడో వార్డు కౌన్సిలర్ కాకర్ల నారాయణమ్మ భీమయ్య ఆధ్వర్యంలో మిషన్ భగీరథ సిబ్బంది కాలనీలో పైప్‌లైన్ పనులు చేపట్టి నీటి సరఫరాను పునరుద్ధరించారు. పైప్‌లైన్ ద్వారా నీరు రావడంతో ఇన్నాళ్లుగా ఎదురుచూస్తున్న కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారానికి కృషి చేసిన కౌన్సిలర్ కాకర్ల నారాయణమ్మ భీమయ్యతో పాటు మిషన్ భగీరథ సిబ్బందికి స్థానికులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప దీక్ష ప్రచార సమితి జిల్లా కాకర్ల భీమయ్య, అధ్యక్షులు మున్సిపాలిటీ మరియు మిషన్ భగీరథ అధికారులు సిబ్బంది కాలనీవాసులు, టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాపనపల్లి శ్రీనివాస్, సీపీఎం నాయకులు వెంకట్రామ్ రెడ్డి, మెడికల్ నారాయణ, రుద్రారెడ్డి, శివారెడ్డితో పాటు పలువురు కాలనీవాసులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


