ప్రశ్నించిన బీఆర్ఎస్ నేతలపై దాడి.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ : కోగిల మహేష్

ప్రశ్నించిన బీఆర్ఎస్ నేతలపై దాడి.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ : కోగిల మహేష్

ములుగు,: నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రశ్నించిన బీఆర్ఎస్ నేతలపై దాడి చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని బీఆర్ఎస్ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కోగిల మహేష్ మండిపడ్డారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి ఇస్తామని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అశోక్ నగర్ బావర్చి హోటల్లో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా హామీలు నెరవేర్చలేదని, అదే హోటల్లో ప్రశ్నించడానికి వెళ్లిన మన్నె క్రిశాంక్ తదితరులపై రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అనుచరులు దాడికి యత్నించారని ఖండించారు. ఉదయం ప్రజాస్వామ్య పరిరక్షణ ర్యాలీ నిర్వహించి, రాత్రి ప్రశ్నించిన వారిపై దాడి చేయడం కాంగ్రెస్ కు రాజ్యాంగంపై ఉన్న గౌరవాన్ని తెలియజేస్తోందని అన్నారు. దమ్ముంటే రాహుల్, రేవంత్ అశోక్ నగర్ కు వచ్చి నిరుద్యోగులకు సమాధానం చెప్పాలని, లేదంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దాడి చేసిన వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేస్తామని శుక్రవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

గాంధీ ఆసుపత్రిలో బాలుడికి ఉచితంగా కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స గాంధీ ఆసుపత్రిలో బాలుడికి ఉచితంగా కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స
హైదరాబాద్:  పుట్టుకతోనే వినికిడి లోపంతో బాధపడుతున్న ఎనిమిదేళ్ల బాలుడికి గాంధీ ఆసుపత్రి వైద్యులు ఉచితంగా కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడకు చెందిన...
అన్ని దానాల కన్న అన్నదానం గొప్పది
ఆలు లేదు - చూలు లేదు,- కొడుకు పేరు సోమ లింగం
ప్రశ్నించిన బీఆర్ఎస్ నేతలపై దాడి.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ : కోగిల మహేష్
ఇళ్లు కోల్పోతున్న ప్రతి కుటుంబానికి న్యాయం చేయాలి
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు తొమ్మిది నెలలుగా వేతనాలు లేవా?
అయ్యప్ప ఆలయ అన్నదానానికి భారీ విరాళం