తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఆరుట్లలో విద్యార్థులకు ప్రతిరోజూ పౌష్టిక అల్పాహారం, పాలు పంపిణీ

తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఆరుట్లలో విద్యార్థులకు ప్రతిరోజూ పౌష్టిక అల్పాహారం, పాలు పంపిణీ

విద్యార్థుల్లో ఆనందం రంగారెడ్డి జిల్లా బ్యూరో చీప్, : తెలంగాణ పబ్లిక్ స్కూల్, ఆరుట్లలో విద్యార్థులకు ప్రతిరోజూ ఉదయం హరే కృష్ణ హరే రామ సంస్థ ఆధ్వర్యంలో రుచికరమైన, పౌష్టిక విలువలు కలిగిన అల్పాహారాన్ని అందించడం ఎంతో అభినందనీయమైన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ప్రతిరోజూ ఉదయం ఇడ్లీలు, దోశలు, బోండాలు తదితర రోజుకొక వివిధ రకాల అల్పాహార పదార్థాలతో పాటు పాలను కూడా అందిస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్యం, పోషణ, చదువుపై ఏకాగ్రత పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడుతున్నాయి. ప్రతిరోజూ రుచికరమైన, పౌష్టికాహారంతో కూడిన అల్పాహారం అందుకోవడం పట్ల పాఠశాల విద్యార్థులు ఎంతో సంతోషం, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల ఆరోగ్యం, విద్యాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ మంచి కార్యక్రమాన్ని అమలు చేస్తున్న హరే కృష్ణ హరే రామ సంస్థకు,ప్రభుత్వానికి పాఠశాల హెడ్ ఆఫ్ ది స్కూల్ సిద్ధగోని గిరిధర్ గౌడ్ గారు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ఆరుట్ల గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. విద్యార్థుల సంక్షేమం కోసం ఇటువంటి మంచి కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి ఆరుట్ల గ్రామ ప్రజలు, పాఠశాల హెడ్ ఆఫ్ ది స్కూల్, ప్రిన్సిపాల్,ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

వరి వేయొద్దని ప్రభుత్వ సూచనలు.. అయినా వరి సాగుకే రైతుల మొగ్గు! వరి వేయొద్దని ప్రభుత్వ సూచనలు.. అయినా వరి సాగుకే రైతుల మొగ్గు!
సిద్దిపేట జిల్లా ప్రతినిధి ;  సిద్దిపేట జిల్లా మొత్తంలో రైతులు అప్పుడే నార్లు పోయడం అప్పుడే దున్నకాలు కూడా అన్ని మండలాలలో వరికోసిన రైతులు ప్రారంభించారు ప్రభుత్వం...
ఆదిలాబాద్ లోఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలి..చల్లా ధర్మారెడ్డి,మాజీ ఎమ్మెల్యే
సీతారాంపూర్ గ్రామ ప్రాథమిక పాఠశాలలో స్వయం పాలన దినోత్సవం
యానగుందిని సందర్శించిన మాజీ ఎంపీ తనయుడు రాయపాటి రంగారావు
ఎల్ నినో వల్ల తాగు నీరు, పశుసంపద పై ప్రభావం - అదనపు కలెక్టర్ నగేష్
‘అడ్డొస్తే జేసీబీలతో తొక్కిస్తాం’ జెన్కో అధికారుల బరితెగింపు బెదిరింపులు!