చౌటకూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
భారత రాజ్యాంగ పీఠికను చదివి ప్రతిజ్ఞ చేసిన ఎంపీడీఓ కే. శంకర్
చౌటకూర్, : భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని చౌటకూర్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగం గొప్పతనాన్ని, ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలను స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) కే. శంకర్ ముఖ్యంగా పాల్గొని కార్యాలయ సిబ్బందితో కలిసి భారత రాజ్యాంగ పీఠికను చదివి ప్రతిజ్ఞ చేయించారు. రాజ్యాంగంలోని ఆశయాలు, ప్రజాస్వామ్య స్ఫూర్తి, సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, సౌభ్రాతృత్వం వంటి విలువలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.భారత రాజ్యాంగం దేశ ప్రజలందరికీ సమాన హక్కులు, అవకాశాలు కల్పిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థకు బలమైన పునాదిగా నిలుస్తోందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాజ్యాంగం నిర్దేశించిన నిబంధనలు, సూత్రాలను ప్రతి పౌరుడు గౌరవించాలని, తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ రాజ్‌కుమార్, ఏపీ రామ్మోహన్, జూనియర్ అసిస్టెంట్ కే. శైలజ, కంప్యూటర్ ఆపరేటర్ వహీద్, అటెండర్ పురుషోత్తం తదితర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

