రాజ్యాంగాన్ని పరిరక్షించాలి : ప్రిన్సిపాల్ ఎం.డి. ముజీబ్
ములుగు : ములుగు జిల్లా కేంద్రంలోని బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్‌లో 77వ రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఎం.డి. ముజీబ్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం యొక్క ఆవశ్యకత, అభివృద్ధి ఫలాలను వివరించారు. నేటి బాలలే రేపటి భారత పౌరులని గుర్తించి, రాజ్యాంగాన్ని పరిరక్షించాలని విద్యార్థులకు సూచించారు. దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పోటీల్లో వ్యాసరచనలో ప్రథమ బహుమతి జి. వైష్ణవి (9వ తరగతి), ద్వితీయ బహుమతి ఇ. శ్రీనిధి (8వ తరగతి), తృతీయ బహుమతి ఆర్. శ్రీవర్ష (9వ తరగతి) సాధించారు. ఉపన్యాస పోటీలో ప్రథమ బహుమతి ఎన్. రిషిత ప్రియ, ద్వితీయ బహుమతి బి. శృతి రాథోడ్ గెలుచుకున్నారు. విజేతలకు ప్రిన్సిపాల్ ముజీబ్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. విజేతలను పాఠశాల యాజమాన్యం డాక్టర్ ఏ. రాజేంద్ర ప్రసాద్ రెడ్డి అభినందించారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు రవికుమార్, రాజేష్, రంజిత్ రెడ్డి, అజయ్ బాబు, రాజు, శ్రీకాంత్, సుకృత సరస్వతి, సోనియా, దిలీప్ పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


