సామాన్య కార్యకర్తలకు ప్రోత్సాహమే బీజేపీకి బలం

అవకాశం కల్పించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్యాల మురళీ మనోహర్ గౌడ్

సామాన్య కార్యకర్తలకు ప్రోత్సాహమే బీజేపీకి బలం

చిగురుమామిడి: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ కరీంనగర్ పర్యటన సందర్భంగా, ఒక సామాన్య కార్యకర్తనైన తనకు వారిని ప్రత్యక్షంగా కలుసుకుని మాట్లాడే అరుదైన అవకాశం కల్పించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ కు బీజేపీ మాజీ జిల్లా కార్యవర్గ సభ్యులు చెప్యాల మురళీ మనోహర్ గౌడ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ గడ్డపై జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ ని కలవడం, వారితో కొద్దిసేపు ముచ్చటించడం తన జీవితంలో మర్చిపోలేని గొప్ప అనుభూతి అని, ఈ అవకాశాన్ని తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో నిరంతరం కష్టపడే ప్రతి సామాన్య కార్యకర్తకు నాయకత్వం అందించే ఇలాంటి ప్రోత్సాహం ఎంతో స్ఫూర్తినిస్తుందని, మరింత ఉత్సాహంతో పార్టీ బలోపేతానికి పనిచేసేలా ప్రేరేపిస్తుందని ఆయన అన్నారు. ఈ అరుదైన అవకాశం లభించడానికి సహకరించిన బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం, పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు లకు మురళీ మనోహర్ గౌడ్ ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

వరి వేయొద్దని ప్రభుత్వ సూచనలు.. అయినా వరి సాగుకే రైతుల మొగ్గు! వరి వేయొద్దని ప్రభుత్వ సూచనలు.. అయినా వరి సాగుకే రైతుల మొగ్గు!
సిద్దిపేట జిల్లా ప్రతినిధి ;  సిద్దిపేట జిల్లా మొత్తంలో రైతులు అప్పుడే నార్లు పోయడం అప్పుడే దున్నకాలు కూడా అన్ని మండలాలలో వరికోసిన రైతులు ప్రారంభించారు ప్రభుత్వం...
ఆదిలాబాద్ లోఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలి..చల్లా ధర్మారెడ్డి,మాజీ ఎమ్మెల్యే
సీతారాంపూర్ గ్రామ ప్రాథమిక పాఠశాలలో స్వయం పాలన దినోత్సవం
యానగుందిని సందర్శించిన మాజీ ఎంపీ తనయుడు రాయపాటి రంగారావు
ఎల్ నినో వల్ల తాగు నీరు, పశుసంపద పై ప్రభావం - అదనపు కలెక్టర్ నగేష్
‘అడ్డొస్తే జేసీబీలతో తొక్కిస్తాం’ జెన్కో అధికారుల బరితెగింపు బెదిరింపులు!