అయ్యప్ప ఆలయ అన్నదానానికి భారీ విరాళం
జిల్లా నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ పట్టణంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో జరుగుతున్న అన్న ప్రసాద వితరణకు న్యూ పాఠశాల సన్నిధానం గురుస్వాములు రూ.62 వేల విరాళం అందజేశారు.కార్తీక మాసం, మండల దీక్షను పురస్కరించుకుని ఆలయంలో అన్నదాన కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమానికి న్యూ పాఠశాల సన్నిధానం గురుస్వాములు కందూరు తిరుపతయ్య, కంచుకట్ల రవి ఆధ్వర్యంలో సన్నిధానం అయ్యప్ప స్వాముల తరఫున రూ.62 వేల ఆర్థిక సహాయాన్ని ఆలయ కమిటీ ప్రతినిధులకు అందజేశారు.ఈ సందర్భంగా గురుస్వాములు మాట్లాడుతూ ఆలయానికి వచ్చే అయ్యప్ప భక్తులకు అన్న ప్రసాదం అందించడం గొప్ప సేవా కార్యక్రమమని, అన్నదానం ద్వారా సేవాభావాన్ని చాటుకోవడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందవచ్చని తెలిపారు. అన్న ప్రసాద వితరణ నిరంతరాయంగా కొనసాగేందుకు తమ వంతు సహకారం అందించినట్లు వెల్లడించారు.అన్నదాన కార్యక్రమానికి సహకరించిన గురుస్వాములు, అయ్యప్ప స్వాములకు ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అయ్యప్ప స్వాముల సేవాభావం అభినందనీయమని పేర్కొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


