ప్రభుత్వం, విధ్యాశాఖ అధికారుల తీరుతో పండగ పూట పస్తులేనా
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్స్వచ్ఛ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి హుస్నాబాద్ మాజీ వైస్ ఎంపిపి గడిపె మల్లేశ్ డిమాండ్.
హుస్నాబాద్:సిద్దిపేట జిల్లాలో స్వచ్ఛ కార్మికులుగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్స్వచ్ఛ కార్మికులు జిల్లా వ్యాప్తంగా 950 మంది స్వచ్ఛ కార్మికులు పనిచేస్తున్నారు అందులో ప్రాధమిక పాఠశాలలో 582, ప్రాథమికోన్నత పాఠశాలలో 150 మంది, జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో 222 మంది స్వచ్ఛ కార్మికులు జిల్లా వ్యాప్తంగా 950 మందికి పైగా పని చేస్తున్నారని 2025-2026 విద్యాసంవత్సరంలో జనవరి, ఫిబ్రవరి,మార్చి ఏప్రిల్ వరకు,2026-2027 విధ్య సంవత్సరంలో జూన్,జూలై ఆగస్టు,సెప్టెంబర్ వరకు వేతనాలను పెండింగ్ లో ఉన్నాయని ప్రభుత్వం, జిల్లా విద్యాశాఖ అధికారుల పనితీరు వల్ల కార్మికులకు నెల నెలా అందించకపోవడం వల్ల కార్మికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలంగాణ రాష్ట్ర కార్మిక,ఉపాధి శిక్షణ ఫ్యాక్టరీ,గనుల శాఖ మంత్రి సిద్దిపేట జిల్లా ఇంఛార్జి మంత్రి జి.వివేక్ వెంకటస్వామి, హుస్నాబాద్ శాసన సభ్యులు రాష్ట్ర రోడ్డు రవాణా బిసి సంక్షేమ శాఖ మంత్రి పోన్నం ప్రభాకర్ జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్వచ్ఛ కార్మికుల దీర్ఘ కాలికంగా రావాల్సిన పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని గడిపె మల్లేశ్ కోరారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


