మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు: ఎస్సై రామకృష్ణ
నస్పూర్(మంచిర్యాల) : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హమాలివాడ అండర్ బ్రిడ్జ్ సమీపంలోని 100ఫీట్ రోడ్డు, హమాలివాడ హనుమాన్ టెంపుల్ మరియు సూర్యనగర్ ప్రాంతాలలో ఆదివారం రోజు రాత్రి సుమారు 9:30 గంటల నుండి 11:00 గంటల వరకు పోలీసులు ఆకస్మికంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఎస్సై రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో వాహనదారులకు బ్రీత్ అనలైజర్ ద్వారా పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఎస్సై రామకృష్ణ మాట్లాడుతూ... మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి విలువైన ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజల భద్రత దృష్ట్యా నిబంధనలు అతిక్రమించే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారు కోర్టు విధించే జరిమానాలు, జైలు శిక్షలకు అర్హులవుతారని పేర్కొన్నారు. వాహనదారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని ఆయన సూచించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


