PRGTA కామారెడ్డి జిల్లా నూతన జిల్లా కమిటీ ఏర్పాటు
అన్ని యాజమాన్య గురుకుల ఉపాధ్యాయుల సంక్షేమమే PRGTA ప్రధాన ధ్యేయం
కామారెడ్డి : ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ గురుకుల టీచర్స్ అసోసియేషన్ (PRGTA) ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలోని మైనారిటీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ గురుకుల సొసైటీలకు చెందిన ఉపాధ్యాయులతో జిల్లా కమిటీ నిర్మాణ సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని యాజమాన్య గురుకుల ఉపాధ్యాయుల సమస్యలు, హక్కులు, సంక్షేమ అంశాలపై విస్తృతంగా చర్చించారు.ఈ సందర్భంగా 24 మంది సభ్యులతో PRGTA నిజామాబాద్ జిల్లా నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఏర్పాటు చేశారు. కామారెడ్డి జిల్లా కమిటీకి ప్రెసిడెంట్ గా D.శ్రీనివాస్
జనరల్ సెక్రటరీగా R.నర్సగౌడ్
వైస్ ప్రెసిడెంట్ గా బాలకృష్ణ
అసోసియేట్ ప్రెసిడెంట్ గా భరత్ కుమార్, అసోసియేట్ జనరల్ సెక్రటరీగా భార్గవి ఎన్నికయ్యారు. ఇతర సభ్యులను కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు.
అన్ని యాజమాన్య గురుకులఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే లక్ష్యం
ఈ సందర్భంగా నూతన జిల్లా కమిటీ సభ్యులు మాట్లాడుతూ, కామారెడ్డి జిల్లాలోని అన్ని యాజమాన్య గురుకులాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం కోసం సమిష్టిగా కృషి చేస్తామని తెలిపారు. వివిధ గురుకుల సొసైటీల ఉపాధ్యాయులను సమన్వయం చేస్తూ, వారి హక్కులు, సంక్షేమం మరియు సమస్యల పరిష్కారం కోసం PRGTA ఆధ్వర్యంలో నిరంతరం పనిచేస్తామని పేర్కొన్నారు.
ప్రధాన డిమాండ్ల సాధనకు నిరంతర పోరాటం
ఈ సమావేశంలో PRGTA రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వేమిరెడ్డి దిలీప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, అన్ని యాజమాన్య గురుకుల ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం PRGTA నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.గురుకుల వ్యవస్థలో పరిపాలనా సమన్వయం మరింత మెరుగుపడేందుకు ఉమ్మడి గురుకులాల కామన్ డైరెక్టరేట్ ఏర్పాటు, 010 పద్దు ద్వారా జీతాల చెల్లింపు, గురుకుల ఉపాధ్యాయులకు హెల్త్ కార్డుల జారీ, కేర్టేకర్ల నియామకం, గురుకుల ఉపాధ్యాయుల ఆత్మగౌరవం మరియు సాధికారత వంటి ప్రధాన అంశాలపై సంఘం తన కార్యాచరణను కొనసాగిస్తుందని ఆయన తెలిపారు.మరింత బలోపేతంగా PRGTA కార్యకలాపాలు జిల్లా నూతన కమిటీ ఏర్పాటుతో జిల్లాలోని అన్ని యాజమాన్య గురుకుల ఉపాధ్యాయులను సమన్వయం చేస్తూ, వారి సమస్యలను సమర్థవంతంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు PRGTA మరింత బలోపేతంగా పనిచేస్తుందని రాష్ట్ర నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో PRGTA రాష్ట్ర నాయకులు గుర్రం రమేష్ గౌడ్, డాక్టర్ I.నిర్మలానందం, ఎం. గంగాధర్, ఉప్పు అశోక్, సంజీవరెడ్డి, లక్ష్మారెడ్డి, గంగారెడ్డి, భరత్ కుమార్, శివ ప్రసాద్, ప్రేమ్ కుమార్, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


