కార్తీక పౌర్ణమి వేడుకల్లో ఏనుగు పల్లకి ఊరేగింపు

భక్తి పారవశ్యంలో తానూర్ గ్రామం.. వీధివీధినా మహిళల హారతులు, భజనలతో ఆధ్యాత్మిక సందడి

కార్తీక పౌర్ణమి వేడుకల్లో ఏనుగు పల్లకి ఊరేగింపు

తానూర్ :  తానూర్ మండల కేంద్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఏనుగు పల్లకి ఊరేగింపును భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామంలోని వీధివీధినా, ఇంటింటికీ ఏనుగు పల్లకిని తీసుకెళ్తూ భక్తి కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఏనుగు విగ్రహానికి, పల్లకికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ మంగళహారతులు సమర్పించారు. భజన కార్యక్రమాలు, భక్తి గీతాలతో గ్రామమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా గ్రామ ప్రజలంతా పల్లకి ఊరేగింపులో ఉత్సాహంగా పాల్గొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా కార్తీక మాసం వచ్చిందంటే పింటూ మహారాజ్ ఆలయ పంతులు ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ సంప్రదాయంలో భాగంగా భక్తులు ప్రతి ఏటా భక్తిశ్రద్ధలతో వేడుకల్లో పాల్గొంటున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో భాగంగా సోమవారం రథయాత్రను గ్రామంలో నిర్వహించనున్నారు. అనంతరం విఠలేశ్వర ఆలయంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ వేడుకల్లో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు.

Views: 8

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

PRGTA కామారెడ్డి జిల్లా నూతన జిల్లా కమిటీ ఏర్పాటు PRGTA కామారెడ్డి జిల్లా నూతన జిల్లా కమిటీ ఏర్పాటు
కామారెడ్డి : ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ గురుకుల టీచర్స్ అసోసియేషన్ (PRGTA) ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలోని మైనారిటీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ గురుకుల సొసైటీలకు చెందిన ఉపాధ్యాయులతో...
రాష్ట్ర అడ్వకేట్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడిగా కనకం రమేష్
ఇందిరమ్మ బీమా పథకం దరఖాస్తుల స్వీకరణ
నసుల్లాబాద్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి.
పురాతన రాత పత్రాలు మన భవిష్యత్తుకు మార్గదర్శకాలు - రాష్ట్ర విశ్రాంత పురావస్తు అధికారి మల్లం వీరేంద్ర
మంచిర్యాల చున్నంబట్టి సమీపంలో రోడ్డు ప్రమాదం.. యువకుడికి తీవ్ర గాయాలు
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి