రాష్ట్ర అడ్వకేట్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడిగా కనకం రమేష్

రాష్ట్ర అడ్వకేట్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడిగా కనకం రమేష్

స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ) :  తెలంగాణ అడ్వకేట్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా స్టేషన్ ఘన్‌పూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కనకం రమేష్ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం రంగారెడ్డి కోర్టులో నిర్వహించిన ఎన్నికల్లో ఆయనకు మరోసారి రాష్ట్ర ఉపాధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తూ న్యాయవాదులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కనకం రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని న్యాయవాదుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు. న్యాయవాదులందరికీ ఆరోగ్య భద్రత కల్పించేలా హెల్త్ కార్డుల సాధనకు కృషి చేస్తానని తెలిపారు. న్యాయవాదుల వృత్తిపరమైన సమస్యల పరిష్కారం, 41 సీఆర్‌పీసీ అంశాలు, అడ్వకేట్ ప్రొటెక్షన్ చట్టం అమలు, న్యాయవాదులపై జరుగుతున్న దాడుల నివారణ వంటి అంశాలపై పోరాటం కొనసాగిస్తానని అన్నారు. నాయెక్క బాధ్యతకు సహకరించిన న్యాయవాదులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. నాపై నమ్మకంతో బాధ్యతను అప్పగించిన పెద్దల నమ్మకాన్ని వమ్ముచేయకుండా ఫెడరేషన్ ను బలోపేతం చేస్తానని అన్నారు.

Views: 7

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

PRGTA కామారెడ్డి జిల్లా నూతన జిల్లా కమిటీ ఏర్పాటు PRGTA కామారెడ్డి జిల్లా నూతన జిల్లా కమిటీ ఏర్పాటు
కామారెడ్డి : ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ గురుకుల టీచర్స్ అసోసియేషన్ (PRGTA) ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలోని మైనారిటీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ గురుకుల సొసైటీలకు చెందిన ఉపాధ్యాయులతో...
రాష్ట్ర అడ్వకేట్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడిగా కనకం రమేష్
ఇందిరమ్మ బీమా పథకం దరఖాస్తుల స్వీకరణ
నసుల్లాబాద్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి.
పురాతన రాత పత్రాలు మన భవిష్యత్తుకు మార్గదర్శకాలు - రాష్ట్ర విశ్రాంత పురావస్తు అధికారి మల్లం వీరేంద్ర
మంచిర్యాల చున్నంబట్టి సమీపంలో రోడ్డు ప్రమాదం.. యువకుడికి తీవ్ర గాయాలు
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి