ఇందూరుకు చేరుకున్న అయ్యప్ప ప్రచార రథం

స్వాగతం పలికిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

ఇందూరుకు చేరుకున్న అయ్యప్ప ప్రచార రథం

నిజామాబాద్  :  భాగ్యనగరంలో డిసెంబర్ 12న నిర్వహించే అయ్యప్ప కోటి నామార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పిలుపునిచ్చారు. కార్యక్రమానికి సంబంధించిన ప్రచార రథం ఆదివారం ఇందూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి అయ్యప్ప స్వామి కార్యక్రమానికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. అయ్యప్ప స్వామి నామాన్ని కోటి సార్లు జపించే బృహత్తర ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని పేర్కొన్నారు. మాలధారణ చేసిన ప్రతి అయ్యప్ప స్వామికి మంచి అవకాశం అన్నారు. ఇందూరు నుంచి అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రచార రథంతో పాటు పాదయాత్ర చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మఠం పవన్, ఆగమయ్య గురుస్వామి, పార్శి రాజేందర్, రాజేష్ స్వామి, అయ్యప్ప సేవ సమితి ప్రతినిధులు పాల్గొన్నారు.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

PRGTA కామారెడ్డి జిల్లా నూతన జిల్లా కమిటీ ఏర్పాటు PRGTA కామారెడ్డి జిల్లా నూతన జిల్లా కమిటీ ఏర్పాటు
కామారెడ్డి : ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ గురుకుల టీచర్స్ అసోసియేషన్ (PRGTA) ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలోని మైనారిటీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ గురుకుల సొసైటీలకు చెందిన ఉపాధ్యాయులతో...
రాష్ట్ర అడ్వకేట్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడిగా కనకం రమేష్
ఇందిరమ్మ బీమా పథకం దరఖాస్తుల స్వీకరణ
నసుల్లాబాద్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి.
పురాతన రాత పత్రాలు మన భవిష్యత్తుకు మార్గదర్శకాలు - రాష్ట్ర విశ్రాంత పురావస్తు అధికారి మల్లం వీరేంద్ర
మంచిర్యాల చున్నంబట్టి సమీపంలో రోడ్డు ప్రమాదం.. యువకుడికి తీవ్ర గాయాలు
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి