గొర్రెలు, మేకలకు అమ్మవారి వ్యాధి నివారణ టీకాలు
సాలూర : మండల కేంద్రంలో గల చలికాలంలో గొర్రెలు, మేకలకు సోకే అమ్మవారి వ్యాధి నివారణకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 18 నుంచి 26వ తేదీ వరకు ప్రత్యేక టీకాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఇన్‌చార్జి పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గొర్రెలు, మేకల పెంపకందారులు ముందస్తు జాగ్రత్తగా తమ పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని సూచించారు. ఒక్కసారి టీకా వేయించుకుంటే మూడేళ్ల వరకు వ్యాధి నుంచి రక్షణ లభిస్తుందని తెలిపారు. ఇప్పటికే సాలంపాడు, కుమ్మంపల్లి గ్రామాల్లో టీకాల పంపిణీ పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. మిగిలిన గ్రామాల్లోనూ నిర్ణీత గడువులోగా టీకాల కార్యక్రమాన్ని పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గొర్రెల కాపరులు, కురుమ సంఘం సభ్యులు, ఒకటో వార్డు సభ్యుడు సాయినాథ్ గిరి, గ్రామ పెద్దలు సొక్కం రవి తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


