ఆదిలాబాద్ డి సి సి అధ్యక్షులు గా నియామకమై సంవత్సరము పూర్తి
ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు – డి సి సి అధ్యక్షుడు నరేష్ జాదవ్*
ఆదిలాబాద్ బ్యూరో : ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు, ప్రజాప్రతినిధులకు, పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు, అభిమానులకు, అధికారులకు, యావత్ ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు మరియు ప్రత్యేకంగా పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న ఈ సందర్భంగా, ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచి, ప్రతి అడుగులోనూ తమ విలువైన సహాయ సహకారాలు అందించిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. తెలిపారు. ఈ ఒక సంవత్సరం కాలంలో ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడం, పార్టీ పునర్నిర్మాణం చేపట్టడం, ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవడం, ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేయడం వంటి కార్యక్రమాలను చేపట్టడంలో మీ అందరి సహకారం ఎంతో కీలకంగా నిలిచిందన్నారు. వివిధ సందర్భాల్లో, వివిధ రూపాల్లో మీరు అందించిన ప్రోత్సాహం, సహకారం, ఆదరణ నాకు మరింత బాధ్యతను, స్ఫూర్తిని ఇచ్చాయన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే విధమైన ప్రేమాభిమానాలు, సహాయ సహకారాలు అందిస్తూ ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మనమందరం కలిసికట్టుగా కృషి చేస్తామని ఆశిస్తున్నాను అని అన్నారు. మీ అందరి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ప్రజలకు మరింత చేరువగా ఉంటూ, నిరంతరం ప్రజాసేవలో ముందుకు సాగుతానని హామీ ఇస్తున్నానన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


